CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అగ్ని పథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలిహైదరాబాదులో నిరుద్యోగుల పై కాల్పులు జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి--:PDSU -PYL

Share it:


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

 హైదరాబాదులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భారత రక్షణ రంగాన్ని ప్రైవేటీకరించడం నిరసిస్తూ,ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ యధాతథంగా కొనసాగించాలని నిరుద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం పై అకారణంగా పోలీసులు కాల్పులు జరిపి దామోదర రాకేష్ తదితర నిరుద్యోగుల మరణానికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పి డి యస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంపాటి పృధ్వీ, పివైయల్ ఇల్లందు మండల కార్యదర్శి గంగాధర భాస్కర్ డిమాండ్ చేశారు.ఈరోజు పి డి యస్ యూ ఆధ్వర్యంలో ఇల్లందు కొత్త బస్టాండ్ సెంటర్లో ఉద్యోగులపై కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ కార్యక్రమానికి పి డి యస్ యూ ఇల్లందు పట్టణ కార్యదర్శి ఎ. పార్థసారథి అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టిన నిరుద్యోగుల పై ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఆందోళనకారులపై కాల్పులు జరిపి నిరుద్యోగుల మరణానికి పాల్పడడం సిగ్గుచేటు అని వారు అన్నారు. దేశంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ కోచింగ్ సెంటర్లకు ఇప్పటికే అధిక ఫీజులు కట్టి ఉన్నారని ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అగ్నిపత్ పథకాన్ని తీసుకు వచ్చి రక్షణ రంగాన్ని సైతం ప్రైవేటీకరించచేందుకు ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలనే అనాలోచిత నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని వారు అన్నారు. ఈ క్రమంలో కడుపు మండిన నిరుద్యోగులు ఆందోళన చేపట్టారని సహనం కోల్పోయిన పోలీసులు విచక్షణారహితంగా రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపి నిరుద్యోగుల మరణానికి కారణమయ్యారని తక్షణమే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.భారత రక్షణ రంగంలో ఉద్యోగ నియామకాలు యథాతథంగా కొనసాగిస్తూ అగ్నిపథ్ పథకాన్ని 

 వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా మరణించిన నిరుద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయాలని,ఈ మారణహోమానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి డి యస్ యూ ఇల్లందు పట్టణ అధ్యక్షులు సాయి పి డి యస్ యూ ఇల్లందు పట్టణ కోశాధికారి తరుణ్ పి డి యస్ యూ ఇల్లందు పట్టణ నాయకులు గంగాధర గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: