CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అగ్నిపథ్ పథకాన్ని వాపస్ తీసుకోవాలి. నిరసన చేస్తున్న ఆర్మీ అభ్యర్థుల పై కాల్పులు జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.

Share it:

  


  •       చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయాలి.  సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి అమర్లపూడి రాము డిమాండ్.


దమ్మపేట జూన్ 17 ( మన్యం   మనుగడ ) : ఆర్మీ జాబ్ రిక్రూట్మెంట్ యధావిధిగా కొనసాగించాలని, అర్మిలో  అగ్నిపధ్ పథకం పేరుతో నిరుద్యోగుల జీవితాల్లో మట్టి కొట్టే విధానాన్ని విరమించుకోవాలని, సికింద్రాబాద్ లో నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులపై  రైల్వే పోలీసులు కాల్పులు, లాఠీ ఛార్జి లు  జరపడాన్ని నిరసిస్తూ సీపీఐ ఎంఎల్  ప్రజా పంథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి అమర్లపుడి రాము డిమాండ్ చేశారు. ఆర్మీ రిక్రూట్మెంట్ లో అగ్నిపధ్ పేరుతో  నిరుద్యోగుల జీవితాల్లో మట్టి కొట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయడం అన్యాయమని అన్నారు. గతంలో హాకింపేట లో నిర్వహించిన ఆర్మీ ర్యాలీ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు అనేక సంవత్సరాలుగా ఆర్మీ లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు, వారికి సంబంధించిన ఎగ్జామ్ నిర్వహించకుండా ఆరుసార్లు వాయిదా చేసిన కేంద్ర ప్రభుత్వం ,మరోసారి  నిరుద్యోగుల జీవితాల్లో మట్టి కొట్టే విధంగా అగ్నిపద్  పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ పథకం కారణంగా నిరుద్యోగ సమస్య ఉదృతం అవుతూ వారి జీవితాలు  అభద్రతకు  గురవుతాయని తెలిపారు. రక్షణ కాపాడాల్సిన ఆర్మీని కూడా ప్రైవేట్ కార్పొరేట్ ఫరం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి అగ్ని పథకానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ,కేంద్ర ప్రభుత్వం తో చర్చించి ఆ పథకాన్ని రద్దు చేసే విధంగా  కేంద్ర మంత్రి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సికింద్రబాద్ స్టేషన్ లో కాల్పులు జరిపి లాఠీ, తూటలను ప్రయోగించిన రైల్వే పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన నిరుద్యోగ కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్మీ నిరుద్యోగ  అభ్యర్థుల మరణాలకి  నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా  సమస్యలు పరిష్కరించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న  తాజా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విద్యార్థుల పోరాట ఘటనలు  రుజువు చేస్తున్నాయని అన్నారు.  దేశంలో నిరుద్యోగుల జీవితాల్లో బట్టి కొట్టే వివాదాస్పదమైన అగ్నిపథ్ పథకాన్ని వాపసు తీసుకోవాలని, విద్యార్థి నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Share it:

TS

Post A Comment: