CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పంచాయతీలల్లో క్రీడా మైదానాలు ప్రారంభోత్సవం.గ్రామీణ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహo.

Share it:

 


  •  గ్రామీణ క్రీడాకారులకు, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు అద్భుతమైన అవకాశం.   



మన్యం మనుగడ వాజేడు: 


భారతదేశంలో క్రీడల అభ్యున్నతికి హర్యానా, తో పాటు పలు ఈశాన్య రాష్ట్రాలలో క్రీడాకారులకు గ్రామీణ ప్రాంతాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ, స్థాయిలో అభివృధ్ధి చేయబడుతోంది. భారత రాజ్యాంగంలో క్రీడలు,లేదా వ్యాయామ విద్య ను ఆర్టికల్, 21 ఎ రాజ్యాంగ అధికరణం కింద ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, ప్రతి పాఠశాలలో వ్యాయామ



విద్య , క్రీడలు, క్రీడాకారులకు పోటీతత్వాన్ని నాయకత్వ లక్షణాలను మానసిక, శరీరక, ఉల్లాసంతో పాటు వ్యక్తి అవయవాల అభివృద్ధికి వ్యాయామలు చాలా ఉపయోగకరం,    గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మండలంలోని ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించింది. ప్రకృతి వనా లు, వైకుంఠధామాలు ఏర్పాటు చేసింది. అలా గే ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను అందించింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు తగిన గర్తింపునివ్వడంతో పాటు వా రిలోని క్రీడా సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేలా క్రీడా ప్రాంగణాలను గురువారం నాడు వాజేడు నాగారం, పేరూరు క్రీడా మైదానాలను ప్రజా ప్రతినిధులు అధికారులు ఘనంగా ప్రారంభించారు.ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం, వాజేడు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొదేబోయన బుచ్చయ్య, ఎంపీపీ శ్యామల శారద, జడ్పిటిసి పుష్పలత, సర్పంచి యాలం సరస్వతి, మండల పరిషత్ అభివృద్ధి అధికారినీ విజయ,జిల్లా స్పెషల్ ఆఫీసర్ సర్దార్ సింగ్, తెరాస మండల అధ్యక్షులు పేను మల్లు రామకృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ తోట నరసింహారావు, కార్యదర్శి రమేష్, ఎంపీటీసీ గుడివాడ చంద్రశేఖర్, తెరాస సీనియర్ నాయకులు వెంకట నర్సయ్య, శేషు, రఘుపతి, వార్డ్ నెంబర్ యాలం సరిత, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: