CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దాతలు రూ. లక్ష ఆర్ధిక సహాయం...ఇద్దరు ఆడపిల్లల పేరు మీద సుకన్య సంవృద్ధి యోజన లో రూ. లక్ష పొదుపు

Share it:

 



  • మూర్తీభవించిన మానవత్వం
  • రోడ్డు ప్రమాద మృతుడు చౌగాని మురళి గౌడ్ కుటుంబానికి అండగా ఆగపేట వాట్సాప్ గ్రూప్
  • వాట్సాప్ అడ్మిన్స్ కి అభినందన ల వెల్లువ
  • కొత్త దామోదర్ గౌడ్ ,

మన్యం మనుగడ ప్రత్యేక ప్రతినిధి:

విధి ఎక్కిరించింది... కాలం కాటేసింది...కొడుకు దిద్దిన కాపురం లో ...ఆ కొడుకు అకాల మృతి తో ఆగమైంది..ఆడుతూ పాడుతూ గపాల్సిన వయస్సులో కన్న తల్లి లాంటి ఊరును విచి పట్నం లో బండి స్టీరింగ్ పట్టాడు ఆ యువకుడు. కొడుకు దిద్దిన కాపురం లా తన కుటుంబాన్ని చక్క దిద్దుకున్నాడు.అంత సజావుగా సాగుతున్న సమయంలో.. ఆ కుటుంబం లో దేవుడు విషాదం నింపాడు.వివరాలు ... దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామానికి చెందిన చౌగాని మురళి గౌడ్(29) గత కొన్ని రోజుల క్రితం సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.ఆయనకు తల్లి,భార్య,ముగ్గురు సంతానం. దీనితో మురళి గౌడ్ కుటుంబం రోడ్డు పడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆగపేట గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ మృతుడు మురళి కుటుంబాన్ని ఆదుకుందాం అని పిలుపు ఇవ్వగానే వాట్సాప్ గ్రూప్ సభ్యులు ,గ్రామ యువత,ప్రముఖులు స్పందించారు.ఎవరి చేతనైన సహాయం వారు అందించారు.64 మంది దాతల నుండి రూ లక్ష రూపాయలు సమకూర్చారు. అనంతరం గ్రూప్ సభ్యుల అభిప్రాయం మేరకు ఇద్దరు ఆడపిల్లల పేరు మీద సుకన్య సంవృద్ధి యోజన లో ఖాతా తెరిచి ఒక్కొక్కరి పేరు మీద రూ.50 వేలు ఫిక్స్డ్ చేసి ఆ కుటుంబం పట్ల మానవత్వం చాటుకున్నారు.సోమవారం మృతుడు మురళి కుటుంబ సభ్యుల కు ఆ మొత్తాన్ని అందజేశారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి బాటలు వేసిన ఆగ్రా పేట వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆగాపేట గ్రామ పెద్దలు, మురళి కుటుంబ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: