CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజులు స్వామినీ దర్శించుకున్న ఆదివాసీ నాయకపోడు సేవ సంఘం మండల ప్రధాన కార్యదర్శి దాది చంటి.

Share it:

 



మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామంలో ఆదివాసీ గిరిజన నాయకపోడ్లు నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర మహోత్సవంలో భాగాంగా జమ్మిగూడెం గ్రామంలో ఆదివారం రాత్రి నుండి సోమరవారం ఉదయం లోపు గ్రామంలో అంగరంగ వైభావంగా మేళతాళాలతో, మంగళ వాయిద్యాలు మద్య గొప్పగా ఊరేగింపు కార్యక్రమం ముగించుకొని జమ్మిగూడెం గ్రామమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినా ఆలయంలో కొలువు దీరిన శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామినీ జాతర మహోత్సవం మొదటి రోజు ఆదివాసీ నాయకపోడు సేవాసంఘం అశ్వారావుపేట మండల ప్రధాన కార్యదర్శి దాది చంటి స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రజలంతా కూడా ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసి గిరిజన సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర ఆదివారం రాత్రి ప్రారంభమై ఊరేగింపు కార్యక్రమం ముగించుకొని సోమవారం ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆలయంలో స్వామివారు కొలువు దీరి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకుంటారని, ఐదు రోజుల పాటు ఉదయం సాయంత్రం సేవా కార్యక్రమం అనగా డోలు చప్పులు, మంగళ వాయిద్యాలు గణాచారుల నృత్యాలు మధ్య స్వామి వారు సేవలు నిర్వహిస్తారని, అదేవిధంగా బుధ, గురు వారం సాయంత్రం కొలంబియ్యం కార్యక్రమం, గురువారం ఉదయం సూర్య పట్నం, చంద్ర పట్నం, మైల పట్నం, గురువారం సాయంత్రం సరువుల కార్యక్రమం, శుక్రవారం ఉదయం నిప్పుల (కొండాలు) గుండాల్లో నడిచే కార్యక్రమం, సాయంత్రం గంథపళ్ళు కార్యక్రమం ఉంటుందని, ఈ జాతర మహోత్సవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్లు పెద్దఎత్తున వస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జాతర మహోత్సవం తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున రావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు దానపు జగపతి, రాజిని చందర్రావు, బేతి వెంకన్న, పెన్నాడ రవి, బేతి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: