CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అమరుల త్యాగం మరువలేనిది. అమర వీరులకు ఘన నివాళులర్పించిన ప్రభుత్వ విప్..

Share it:

 



మన్యం మనుగడ, కొత్తగూడెం:



 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానం నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సీఎం కేసీఆర్ సంకల్ప సిద్ధి కారణంగానే అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర భాగాన నిలిచిందననిన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుందన్నారు.8 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల సంక్షేమాన్ని కోరి సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఉచిత కరెంట్ తో తెలంగాణ ప్రజలకు విద్యుత్ కష్టాలు తీరాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రైతుబంధు, వంటి ఎన్నో మంచి పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిందన్నారు.తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ గారు అంతే పట్టుదలతో బంగారు తెలంగాణ సాధన కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి పల్లె పట్టణానికి మిషన్ భగీరథ పేరుతో మంచినీటిని అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బలంగా నిలబెడుతున్నారు అని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి దాకా అభివృద్ధి ఎలా జరుగుతుందో, ఇక ముందు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అన్నారు.అనేక పోరాటాలు త్యాగాలు బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఉద్యమ సారథి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని చెప్పారు. సుదీర్ఘంగా శాంతి యుత పద్ధతిలో అన్ని వర్గాల ప్రజల కృషి ఫలితంగా ఏర్పడిన తెలంగాణను అన్ని రంగాలలో దేశం గర్వంచదగిన రీతిలో సీఎం కేసీఆర్ నిలబెట్టారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న విశేష కృషి ఫలితంగా రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందన్నారు, సాగు త్రాగునీరు, విద్య ,వైద్యం , రోడ్లు తదితర మౌలిక వసతులను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప దీర్ఘకాలిక లక్ష్యాలతో పూర్తి చేస్తున్నారని అన్నారు.బంగారు తెలంగాణ లక్ష్యంగా టిఆర్ఎస్ సర్కార్ పనిచేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరావు , జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోరం కనకయ్య , జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ , కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి కాపు సీతామాలక్ష్మి , జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ , జిల్లా ఎస్పీ సునీల్ దత్ , అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, పలు శాఖల ప్రభుత్వ ఉన్నత అధికారులు , టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నా

Share it:

TS

Post A Comment: