CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ.రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికి వరంగల్ రైతు డిక్లరేషన్

Share it:


  • వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రతి పల్లెకు, ప్రతి గడపగడపకు తీసుకుపోతాం.
  • కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణ మాఫీ చేస్తాం.
  • కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రాంనగర్, లంబాడి తండ గ్రామాలలో మంగళవారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరై మాట్లాడుతూ. రైతుల కష్టాలను తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. రైతుని రాజు చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యవుసం బాగుపడ్డ చరిత్ర లేదని అన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరుతో ఐదు నుండి ఆరు కేజీల వరకు ధాన్యం కటింగ్ చేస్తున్నారని, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా కింద కౌలు రైతులకు ఎకరాకు ఏటా రూ.15000/ పెట్టుబడి సాయం, ఉపాధి హామీ కూలీలకు ఏటా రూ.12000/ ఆర్థిక సహాయం, వ్యవసాయానికి ఉపాధిహామీ అనుసంధానం, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, మెరుగైన పంట బీమా, రైతులు,కూలీలు భూమి లేని రైతులకు రైతు బీమా, కొత్త రెవెన్యూ వ్యవస్థ ను రైతుల ముందుకు తీసుకువస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు బందు తప్ప రైతు ల సమస్యలు పరిష్కారం కావడం లేదని అన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని పరిస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఈ సందర్భంగా సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అయూబ్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరసవడ్ల వెంకన్న, మండల అధ్యక్షులు చిట మట రఘు, కన్నాయిగూడెం జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ, జిల్లా మైనార్టీ నాయకులు ఖలీల్ ఖాన్, మాజీ ఎంపీటీసీ సభ్యులు వావిలాల నర్సింగరావు,కోడి రాంగోపాల్, ఏటూరు నాగారం పిఎసిఎస్ వైస్ చైర్మెన్ చెన్నూరి బాలరాజు, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు అప్సర్ పాషా, జిల్లా మహిళా నాయకులు రాధిక, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, ఉపాధ్యక్షులు ఎండి రియాజ్, మండల యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల నవీన్, టౌను యూత్ అధ్యక్షులు బండారి లక్కీ, టౌను కార్యనిర్వాహక కార్యదర్శి సరి కొప్పుల శ్రీనివాస్, వార్డు సభ్యులు హనుమంతు, మానస, సీనియర్ నాయకులు గద్దల సత్యనారాయణ, బత్తుల వెంకన్న,గాలిబ్, సాధన పల్లి లక్ష్మయ్య, రామ్ నగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మహేందర్, రామన్నగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు గార మహేష్, యూత్ నాయకులు నాగ వత్ కిరణ్, విక్రమ్, ముస్తఫా, ప్రశాంత్, రాజబాబు, సద్దాం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: