CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుల జీవితాలలో వెలుగులు నింపడానికి వరంగల్ రైతు డిక్లరేషన్.--:సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: మండలం, చొప్పాల గ్రామ పంచాయతిలోనీ గోడుగుబండ చెరువులో ఉపాధి హామీ పనిలో పాల్గొనీ కాంగ్రెస్ పార్టీ రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రైతు డిక్లరేషన్ పై అవగాహన కల్పిస్తూ రైతులతో,మహిళలతో కలిసి రచ్చ బండ కార్యక్రమాన్ని నిర్వహించి. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్‌ ఇక్బాల్ హుస్సేన్.కూలీలకు తాగడానికి కూల్ డ్రింక్స్ ఇప్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే,ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ.ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15 వేలు పెట్టుపడి సాయం. భూమి లేని రైతుకూలీలకు ఏడాదికి 12 వేల ఆర్థిక సాయం చేస్తాం.అన్ని పంటలకు గిట్టుబాటు ధరలతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.ధరణి పోర్టల్ రద్దు చేస్తాం.రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం. మూతపడిన చెరుకు కర్మాగారాలను తెరిపించి, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం. పోడు భూముల రైతులకు, అసైన్డ్ భూముల లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి ఎకరా వరకు నీరందిస్తాం.ఈ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ 

అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను నట్టెట్ట ముంచుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు, పేద ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎట్టి నర్సయ్య గారు, మండల నాయకులు చెన్నూరి రవీందర్, రేగుళ్ళ గ్రామ అధ్యక్షులు గోగు కిరణ్, ఉపాధ్యక్షులు కొండగొర్ల సమ్మయ్య, గ్రామ కిసాన్ అధ్యక్షులు గాంధర్ల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: