CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

లక్ష్మీనగరం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిలో గిరిజనేతరుల అక్రమ కట్టడాలను కూల్చి వేయాలి..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం, జూన్ 07 ::


దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగరం గ్రామం పరిధిలో సర్వే నెంబర్ 118/1, 118/2 గల ప్రభుత్వ భూములను కొంతమంది గిరిజనేతరులు అక్రమంగా 1/70 చట్టానికి విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని గిరిజనేతరుల బహుళ అంతస్తులను కూల్చివేయాలంటూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం తహసీల్దార్ కి ఆదివాసి సంఘం నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోయం కామరాజు మాట్లాడుతూ గత మే నెలలో 12వ తేదీన రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి వెళ్లిన అధికారులు ఒక గిరిజనేతరుడి ఇల్లు మాత్రమే కూల్చివేసి మిగిలిన అక్రమ నిర్మాణాలను వదిలివేసి రావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. తక్షణమే ప్రభుత్వ భూములలో బహుళ అంతస్తుల నిర్మాణాలు కూల్చి వేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల భూమిలేని నిరుపేద ఆదివాసీలకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూములను పంచి పెట్టాలంటూ లేనియెడల ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో భూ పోరాటానికి దిగుదామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి మండల అధ్యక్షులు కుర్సం రవి, మంగరాజు, గట్టుపల్లి రాజు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: