CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

యువత వ్యవసాయ ఆధారిత వ్యాపారాల్లో రాణించాలి..జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

యువత వ్యవసాయ ఆధారిత వ్యాపారాలలో రాణించాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని రాజుపేటలో సుంకరి రాధాకృష్ణ నెలకొల్పిన ఎస్.వి.ఆర్ డ్రిప్ ఇరిగేషన్ మరియు మల్చింగ్ సీట్ వ్యాపార సముదాయాన్ని రాధాకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత వ్యాపారాలలో అపారమైన అవకాశాలు ఉన్నాయని విద్యావంతులైన గ్రామీణ యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.వ్యవసాయ వ్యాపారాల్లో నైపుణ్య అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో అనేక సంస్థలు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగపేట మండలం లో గత సంవత్సరంతో పోలిస్తే మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా వ్యవసాయంలో రోజు రోజుకు వస్తున్న అధునాతన పద్ధతులను అన్నదాతలు ఆచరించడం ద్వారా అధిక దిగుబడులను అదనపు రాబడులను అందుకోవచ్చు నన్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా మిర్చి సాగు లో బిందుసేద్యం మల్చింగ్ పద్ధతులను రైతులు విధిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. రాజుపేటలో బిందు సేద్యం మరియు మల్చింగ్ పరికరాలను అందుబాటులో ఉంచడం ద్వారా ఈ ప్రాంత మిర్చి రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఆర్ డ్రిప్ ఇరిగేషన్ మరియూ మల్చింగ్ సీట్ ప్రొప్రైటర్ సుంకరి రాధాకృష్ణ, కిసాన్ కాంగ్రెస్ నాయకులు వల్లిపెళ్లి శివప్రసాద్, సుంకరి రఘు, భత్తుల నందకుమార్, పంతగాని వెంకటేష్, సుంకరి రమణయ్య దుగినేపల్లి సర్పంచ్ మలిపెద్ది సత్యవతి, వెంకన్న,ఉగ్గె సమ్మయ్య అండెం కృష్ణారెడ్డి,కోడం రాము, కటుకూరి సాంబశివరావు యడ్లపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: