CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీతమ్మ ప్రాజెక్టు గ్రామ కంఠం భూములకు నష్టపరిహారం చెల్లించాలి..ఇరిగేషన్ ఎస్ ఈ కు వినతి పత్రం సమర్పించిన గ్రామస్థులు..

Share it:

 


మన్యం టివి దుమ్ముగూడెం ::


దుమ్మగూడెం వద్ద గోదావరినదిపై ప్రభుత్వం నిర్మిస్తున్న సీతమ్మ ప్రాజెక్ట్ వలన నష్టపోతున్న ఎస్ కొత్తగూడెం గ్రామ కంఠం భూములకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఇరిగేషన్ ఎస్ ఈ కె.వెంకటేశ్వరరెడ్డి కి ఆ గ్రామస్తులు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు దుమ్ముగూడెం మండలంలో సీతమ్మ ప్రాజెక్టు లెఫ్ట్ బ్యాంకింగ్ కరకట్ట పనులను ఆయన పరిశీలించడానికి దుమ్ముగూడెం మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు కొమ్ము రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఇరిగేషన్ ఎస్ ఈ ని కలిశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తాతలు తండ్రులు నుండి అక్కడ నివాసం ఉన్నామని ఇప్పటివరకు గ్రామస్తుల స్వాధీనంలోనే గ్రామ కంఠం భూములు ఉన్నాయని ఆ భూములకు నష్టపరిహారం చెల్లించకుండానే సీతమ్మ ప్రాజెక్టు కరకట్ట పనులు నిర్వహిస్తున్నారని తమ ఆవేదనను తెలిపారు ఎస్. కొత్తగూడెం గ్రామస్తులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఎస్ ఈ స్పందిస్తూ ఈ సమస్యను ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లో ఎస్ కొత్తగూడెం గ్రామస్తులు వెంకటేశ్వరరావు,నాగమణి, నాగేశ్వరరావు, వెంకన్న బాబు, శ్రీనివాస రావు,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: