CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎమ్మెల్యే అనుచరులు ఒక న్యాయం దళితులకు ఒక న్యాయమా....

Share it:

 


  • - దళితుల పై కేసు నమోదు చేసిన అధికారులు ఎమ్మెల్యే అనుచరులపై కేసులు ఎందుకు నమోదు చేయరు...
  • - అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్న అధికారులు..
  • - ఏజెన్సీ దళితుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నడ్డి రవికుమార్..


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ :

చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు చేస్తూ యథేచ్ఛగా రవాణా చేస్తున్న ఎమ్మెల్యే అనుచరులు ఒక న్యాయం దళితులకు ఒక న్యాయమా అంటూ ఏజెన్సీ దళితుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నడ్డి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఎలాంటి అనుమతులు లేకుండా దామరచర్ల చెరువులో యదేచ్చగా మట్టిని తరలిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడికి సంబంధించిన జెసిపినీ నడ్డి రవికుమార్ అడ్డుకున్నాడు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితులను వివక్షతకు గురి చేస్తూ అధికార పార్టీకి ఏజెంట్లుగా అధికారుల వ్యవస్థ మారిందన్నారు. ఎమ్మెల్యే అనుచరులు కొందరు ఎటువంటి అనుమతులు లేకుండా యదేచ్చగా చెరువు మట్టిని తన ఇష్టానుసారంగా తోలుకోవచ్చు గాని అదే ఒక పేద రైతు వర్షాలకు తన పొలంలో వచ్చే వరదలకు గురయ్యే పొలంకు మట్టి తోలుకోవాలంటే పోలీస్, రెవెన్యూ, అనుమతి తప్పనిసరి అని చెప్పి ఆ రైతుపై ఇద్దరు కలిసి ఇష్టం వచ్చిన రీతిలో పలు సెక్షన్ల కింద ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేస్తారు. అవసరమైతే రెవెన్యూ వ్యవస్థతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించి దళితులపైన పేద రైతుల పైన విధినిర్వహణ కేసులు కూడా పెడుతున్నారు. మరి ఈ ఎమ్మెల్యేకు, అనుచరులకు, దళితులంటే ఎందుకు ఇంత వివక్షత అని ప్రశ్నించారు. ఇదే ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు దళితుల ఓట్లతో గెలిచి దళితులపై పోలీస్ వ్యవస్థ ఇష్టం వచ్చిన కేసులు పెడుతున్న పట్టించుకోకపోవడం దళితులపై వారికున్న ప్రేమ ఎంతో అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్యే అనుచరులు కొందరు ఈ ప్రాంతంలో తామే ఇసుక, మట్టి తోలకాలు నిర్వహించాలని. అలా కాదని దళితులు, గిరిజనులు. ఎవరైనా రవాణా చేస్తే ఎమ్మెల్యే అనుచరులు దగ్గరుండి పోలీసు వారితో ట్రాక్టర్లపై దాడులు చేయిస్తు కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు చెప్పిన విధంగా పోలీస్ వాళ్ళు కీలుబొమ్మలుగా ఇష్టమొచ్చినట్లు దళితులపై దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఒక న్యాయం.? దళితులకు ఒక న్యాయమా.? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇదంతా ఎమ్మెల్యే చేస్తున్నాడా..? లేదా ఎమ్మెల్యే పేరు చెప్పి వారి అనుచరులు చేస్తున్నారా..? దీనికి ఎమ్మెల్యే పూర్తి బాధ్యత వహించి సమాధానం చెప్పాలని లేనిపక్షంలో దళితుల సేవా సంఘం ఆధ్వర్యంలో దళితులు గిరిజనులు అందరూ కలిసి ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

Share it:

TS

Post A Comment: