CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీలను వెంటాడుతున్న పోడు సమస్య -గ్రామాలకు తరలండి కార్యక్రమంలో పిడిఎస్యు నాయకుల పరిశీలన

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు జీవనాధారమైన పోడు భూమిని ఫారెస్ట్ అధికారులు నిర్ధాక్షణ్యంగా గుంజుకుంటూ ఆదివాసీల పై దాడులు చేస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని దీనితో పోడు సమస్య ఆదివాసీలను నిత్యం వెంటాడుతున్న సమస్యగా మారిపోయిందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కారం సంధ్య, కాంపాటి పృథ్వి అన్నారు. ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి డి యస్ యూ) రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామాలకు తరలండి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పిడిఎస్ యు బృందం అశ్వారావుపేట మండలం కావడి గుండ్ల, కొత్త కావడి గుండ్ల, కంట్లం, గోపన్న గూడెం తదితర గ్రామాలలో పి డి యస్ యు నాయకత్వం ప్రజల జీవన విధానం, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల పై సర్వే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో వెలువడిన ప్రధాన సమస్య పోడు భూమి సమస్య ఆదివాసీలను తీవ్రంగా వెంటాడుతోందని స్వయంగా కెసిఆరే ఈ జిల్లాకు వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని సమస్య పరిష్కారం చేస్తానని ఇచ్చిన హామీ నీటిమీద రాతలు లాగే మిగిలిపోయిందని వారు అన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే ఆదివాసి గూడాలపై, వారు సాగు చేసుకునే భూములను ఆక్రమించుకునేందుకు ఫారెస్ట్ దౌర్జన్యాలు మరింత పెరిగిపోతున్నాయని, న్యాయ పోరాటం చేస్తున్న ఆదివాసి బిడ్డల పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తూ కల్లోలాలను సృష్టిస్తున్నారని వారు అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం ఈ సమస్యను సావధానంగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని నమ్మి కెసిఆర్ కు పట్టం కట్టిన ప్రజల బతుకులు బజారు పాలు అవుతున్నాయని వారన్నారు. చదువుకున్న వారికి ఉద్యోగాలు లేక, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఒక పక్క రైతులు మరో పక్క నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్నా కేసీఆర్ కనీసం స్పందించకుండా తెలంగాణ వనరులను కేంద్రీకృతం చేసుకొని తన కుటుంబ ఖజానాలో వేసుకుంటున్నాడని వారు విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకొని బతుకు లేక అల్లాడుతున్న నిరుపేదలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం నిరుపేదల జీవితాలతో చెలగాటమాడుతోందని వారు అన్నారు. ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారానికై కేసీఆర్ ప్రభుత్వం పూనుకోవాలని లేనిపక్షంలో ప్రజా ఆందోళన ఉధృతి మరింత పెరుగుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా అశ్వారావుపేట మండల కార్యదర్శి కల్లన్న, పీ వై ఎల్ రాష్ట్ర నాయకులు వాసం బుచ్చిరాజు, పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు యనగంటి వంశి వర్ధన్, ప్రణీత్ రాజు, గంగాధర గణేష్, రంగవల్లి మండల, డివిజన్ నాయకులు గంగరాజు, జ్యోతి, సునీత,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: