CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అభివృద్ధి దిశగా పల్లెలు ప్రయాణించాలి.పల్లెలు,పచ్చటి పల్లెలు గా మారాలని, అందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.--:జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

పల్లెలు, పచ్చటి పల్లెలు గా మారాలని, అందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య కోరారు.

బుధవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా

కలెక్టర్ ఏటూరునాగారం మండలం, శివాపూర్ గ్రామంలోని నర్సరీ, పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు .

గ్రామంలో నర్సరీ,పల్లె ప్రకృతి వనం అన్ని విధాలుగా బాగున్నాయని సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ని అభినందించారు.

గ్రామంలో ఏర్పాటుచేసిన నర్సరీ పరిశీలించిన కలెక్టర్ మొక్కల పెంపకం పై అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజు చెత్త సేకరణ, రోడ్లను శుభ్రం చేయడం, మురికి కాలువలు చెత్త తొలగింపు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పల్లె ప్రగతి పనులు జోరుగా సాగాలని, అభివృద్ధి దిశగా పల్లెలు పయనించాలన్నారు. పల్లె ప్రగతి, హరితహారం లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

అనంతరం ఐటిడిఎ కార్యాలయం సమావేశాల్లో విలేకరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభం కానుండడంతో ఏజెన్సీ గ్రామాలలో ముందస్తుగా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. మండలంలో 

షాపల్లి, దొడ్ల,గ్రామాల ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు అన్ని ఏర్పాట్లు మరమ్మతులకు నిధులు కేటాయించి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. జాతీయ రహదారి పై పెద్ద పెద్ద గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నాయని తన దృష్టికి రావడం జరిగిందని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీ ఓ వసంత రావు,ఏ ఓ రఘు, ఎస్ ఎ రాజ్ కుమార్, 

మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈఓ రమాదేవి, ఏటూరునాగారం తహసీల్దార్ సంజీవ, ఎంపీడీవో కుమార్, సర్పంచ్ దేవేందర్, ఉప సర్పంచ్ రాణి, కార్యదర్శి హసీనా బేగం,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: