CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం.సర్వసభ్య సమవేశానికి గైర్హాజర్ అయిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీపీ. రేగా కాళికా

Share it:

 



  • గ్రామాల అభివృద్ధికి అందరూ సహకరించాలి

 మన్యం మనుగడ కరకగూడెం: ప్రతి మూడు నెలలకు ఒక్కసారి గ్రామీణా ప్రాంతల ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు,ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మొదలగు అంశాలపై నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం సాదా సీదాగా సాగింది. మండల పరిషత్‌ కార్యలయములో ఎంపీపీ రేగా కాళికా అధ్యక్షతన జరిగిన సమావేశానికి జరిగింది.ఈ సమావేశంలో గ్రామలలో ప్రజలు ఎందుర్కొంటున్న సమస్యలు,విద్యుత్‌,ఉపాధి హామీ,హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, మొదలగు అంశాలపై సంబంధిత అధికారులు సర్పంచ్‌ ల ఎదుట వారివెంట తెచ్చుకున్న ప్రగతి నివేదిక ను చదివి వినిపించారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వాటిని పరిష్కరించేలా సమావేశాలు జరగాలని ఎంపీపీ రేగా.కాళికా అన్నారు. అంగన్వాడి కేంద్రలో క్షేత్రస్థాయి, పర్యవేక్షణ లేదని, అంగన్‌వాడీ సెంటర్లకు వచ్చిన పాలు,గుడ్లు పంపిణి జరగడం లేదని సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ రేగా.కాళికా మాట్లాడుతూ. కొన్నిశాఖల అధికారులను మందలించారు. సమావేశానికి వచ్చామా, వెళ్లామా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని వారి పద్ధతి మార్చుకోవాలని గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఆమె అన్నారు.పల్లె ప్రగతి కార్యక్రమం లో అందరూ పాల్గొని గ్రామాలను అందంగా తీర్చిదిద్దాలని అన్నారు. అధికారులందరూ సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సర్పంచులు అందరూ తమ పంచాయతీలలో జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రానున్నది వర్షాకాలం కావడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడం తో డ్రైనేజీలు మురికి కాలువలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్‌ సంధ్య ,ఎంపీడీవో శ్రీనివాసు, గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: