CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మత్స్య శాఖ కమిషనర్ ను కలిసిన ఆదివాసీలు.ఏటూరు నాగారం ఐటీడీఏ పేసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో గల ప్రస్తుత జిల్లాలోని ములుగు జిల్లాలో112గ్రామ పంచాయతీలు,వరంగల్ జిల్లాలో 13 గ్రమ పంచాయతీలు ,మహబూబాబాద్ జిల్లాలోని 53 గ్రామ పంచాయతీలలో మొత్తం కూడా 178 గ్రామ పంచాయతీలలోని ఏజెన్సీ ప్రాంతంలోని చెరువులకు పే సా చట్టం , GO NO.74 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజనులకు సొసైటీలు ఏర్పాటు ద్వారా ఆర్థిక వృద్ధిలోకి తీసుకురావాలని గిరిజన ప్రాంతాల్లోని చెరువులకు పేసా చట్టం ద్వారా గిరిజనులకే హక్కు కల్పించాలని కోరుతూ, శనివారం హైదరాబాదులో మత్స్య శాఖ కమిషనర్ ను కలవడం జరిగిందని,పేసా కోఆర్డినేటర్ ప్రభాకర్ అన్నారు.మూడు జిల్లాల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో గిరిజనేతరులు దొడ్డిదారిన చేపించిన మత్స్య సొసైటీలను తక్షణమే రద్దు చేసి పేసా చట్ట తీర్మానం మేరకే ఆదివాసీ గిరిజనులతో మత్య్స సొసైటీలను ఏర్పాటు చేయాలని మత్య్స శాఖ కమిషనర్ లచ్చిరామ్ నాయక్ ను కోరామని అన్నారు.మత్స్య శాఖ కమిషనర్ మాట్లాడుతూ. ఏజెన్సీ ప్రాంతంలో నుండి మత్య్స సొసైటీల ఏర్పాటు కొరకు ముందుకు వచ్చిన ఆదివాసీ గిరిజనులకు నేను ఎప్పుడు కూడా అండగా ఉంటానాని ఏజెన్సీ ప్రాంతంలోని పేసా చట్టప్రకారం అన్ని సొసైటీలను చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తామని చెప్తూ చేపలను తినటం వలన చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలను మహిళలకు ఎక్కువగా పేసా గ్రామ సభల ద్వారా అవగాహన కల్పించే బాధ్యతలు పేసా కమిటీలు తీసుకోవాలని మత్య్స శాఖ కమిషనర్ లచ్చిరామ్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మోకాళ్ళ వెంకన్న , పేసా మోబిలైజర్స్ అగబోయిన రవి ,గొంది నాగేశ్వరరావు ,

మోదిన్ ,గట్టి సత్యం,బాలు 

పడిగ నాగేశ్వరరావు,పడిగ మంగయ్య ,ఎట్టి భాస్కర్, శివకుమార్ ,సారయ్య , హరికుమార్ ,సారంగం,వెంకన్న,పృద్విరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: