CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉన్నత విద్యను బలోపేతం చేద్దాం.వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రాజెక్టు అధికారి అంకిత్.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం 

ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయం లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం ప్రాజెక్టు అధికారి అంకిత్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ముందుగా డిప్యూటీ డైరెక్టర్స్ తో బడిబాట కార్యక్రమం పై, విద్యార్థుల తల్లిదండ్రులతో ఇంగ్లీషు మీడియం పై అవగాహన కల్పించడంతో పాటు, ఆశ్రమ పాఠశాలలో హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, ఉచిత దుస్తులు,పుస్తకాలు, నోట్ బుక్స్,పెన్నులు, కాస్మోటిక్స్ అన్ని ను ఉచితంగా విద్యార్థులకు అందజేస్తారని, గ్రామ సర్పంచ్ ల ద్వారా ప్రచార కార్యక్రమాలు చెయ్యాలని,అదేవిధంగా ఉపాధ్యాయులను హాబీటేషన్ లకు కేటాయించి,ఆ హాబీ టేషన్లలో బడి ఇడు పిల్లలను గుర్తించి,డ్రాపౌట్స్ లేకుండా అందరినీ ఎన్రోల్మెంట్ (నమోదు) చేయించాలని వారి వారి గ్రామాలలో డ్రాపౌట్స్ లేరని ధృవీకరించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఏటూరు నాగారం ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో మైనర్ రిపెర్స్,కాంపౌండ్ వాల్స్,టాయిలెట్స్,మంచినీటి వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి ఆదేశించారు.ఈ సమావేశంలో ఏటూరు నాగారం డిప్యూటీ డైరెక్టర్ పోచం,హన్మకొండ డిటి డిఓ ప్రేమకళ,వరంగల్ డిటిడి ఓ జహీరుద్దీన్,డిప్యూటీ ఈవో సారయ్య,ఏటూరు నాగారం ఏ టిడివో దేశి రామ్, మహబూబాబాద్ ఏటిడిఓ సత్యవతి,ములుగు ఏసిఎంఓ రవీందర్,మహబూబాబాద్ ఏ సిఎంఓ వీరు లాల్,ఈఈ ప్రేమ లత,డిఇ నవీన్,ఏఈ లు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: