CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉత్సాహంగా బడిబాట.కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు..

Share it:


మన్యం మనుగడ, మణుగూరు:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని బాపన కుంటలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రభుత్వ పాఠశాలలోనే అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతున్న దని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం కలిగిందని అన్నారు , పాఠశాలల్లో ఉన్నత విద్యను అందిస్తూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు విద్యను అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడులలో ను ఆంగ్ల మాధ్యమం మొదలు కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ మంది పిల్లల చేర్పించేలా చూడాలన్నారు. ఈ మేరకు మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు మన ఊరు మన బడి కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది అన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు పార్టీ సీనియర్ నాయకులు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: