CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

యువత క్రీడా ప్రాంగణాలను వినియోగించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:

 


మన్యం మనుగడ మణుగూరు:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని పీకే వన్ సెంటర్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,

 విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించేందుకు అనువుగా క్రీడా మైదానాల ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

 రాష్ట్రంలో ఊరూరా క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి ఊరూరా క్రీడా మైదానాలను ఏర్పాటు చేసిన ఘనత దేశంలోనే టిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు...

 నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని తెలియజేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చిన్న గ్రామాలు గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు చేయడం జరిగిందని తద్వారా గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు కోట్ల రూపాయలు కేటాయించలేదని మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మన సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని గ్రామాలు అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామ అభివృద్ధికి గ్రామంలోని ప్రజలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: