CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అమాయక గిరిజనులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ టీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుబల్లి రమేష్ బాబు డిమాండ్.

Share it:

 



దమ్మపేట జూన్ 08 ( మన్యం మనుగడ ) : తెలంగాణ స్వరాష్ట్రము సాధించుకొని నేటికీ 8 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో గిరిజనులపై తెరాస ప్రభుత్వం మరియు అధికారులు సవితి ప్రేమ చూపిస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రo లో స్పష్టంగా కనిపిస్తున్నది. బంగారు తెలంగాణ అందించడమే లక్ష్యం గా పనిచేస్తా అన్న కెసిఆర్ నేడు అదే తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరి ముఖ్యంగా గిరిజనులను ఇంకా బానిసలుగానే చూస్తు పరిపాలిస్తుడటం, గిరిజనులపై ప్రభుత్వ అధికారులు చూపిస్తున్న వివక్షను గుర్తించిన కొందరు మీడియా ప్రతినిధులు అదికారుల పేర్లు చెప్తు, ప్రజాప్రతినిధుల అండదండలతో అమాయకపు గిరిజనులపై అక్రమంగా అన్యాయపు బెదిరింపులు, అన్యాయపు కేసులు వేస్తూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల కాలం లో దమ్మపేట మండలం గంగులగూడెం కి చెందిన గిరిజన రైతు వంకా రాజారావు తన తాతల కాలంనాటి సాగు చేస్తున్న పొలం లో బోరు కొంత కాలంగా పాడవడం జరిగింది. అప్పో సొప్పో చేసి తన సొంత డబ్బు తో కొత్త బోరు వేస్తున్న క్రమంలో కొందరు మీడియా ప్రతినిధులు, రెవిన్యూ అదికారులమని పర్మిషన్ ఎవరిచ్చారని బెదిరించి గిరిజన రైతు నుండి కొంత సొమ్ము డిమాండ్ చేయడం జరిగింది. బెదిరరింపులకు బయపడిన వంకా రాజారావు అడిగిన డబ్బు ఇవ్వడం జరిగింది. తర్వాత విషయం ఆరా తీయగా రెవిన్యూ అధికారులు కాదని కొందరు మీడియా ప్రతినిధులు అని తెలిసి అన్యాయాన్ని ఖండిస్తూ గిరిజన రైతులు సుమారు 100 మంది బాధితులతో ధర్నా చేసి రెవిన్యూ అధికారులకు, స్థానిక పోలీస్ లకు పిర్యాదు చేయడం జరిగింది. పోడు భూమి సాగుచేయకుండా అధికారులతో గిరిజనులపై దాడులు చేయించి కేసులు పెడతారు, సొంత భూమిలో సాగుచేయకుండా అడ్డు వస్తారు గిరిజన ప్రజలు ఇంకెలా బ్రతికేది , ఇదేనా బంగారు తెలంగాణ అని మేము గిరిజనుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.దీనిపై తక్షణమే సంబంధిత రెవిన్యూ అధికారులు పోలీస్ వారు తగు విచారణ చేసి, అమాయక గిరిజనులపై వీరు చేస్తున్న అక్రమ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని గిరిజనుల పక్షాన అధికారులను డిమాండ్ చేస్తున్నాము. పిర్యాదు చేసిన పట్టించుకోని, స్పందించని అధికారులను సహించేది లేదని చట్ట పరంగా అమాయకపు గిరిజనుల పక్షాన హైకోర్టు లో పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ఫిల్, SC,ST కమిషన్ కి, మానవ హక్కువ కమిషన్ ను ఆశ్రయించి గిరిజన ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తూ వెంటనే సంబంధిత రెవిన్యూ, పోలీస్ అధికారులు స్పందించి భాదిత గిరిజన కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షం లో సహించేది లేదని గిరిజన ప్రాంతం లో గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రజలకు సర్వీస్ చేయాల్సిన అధికారులు ఆ అధికారాన్ని తుంగలో తొక్కి కొందరి గిరిజనేతరుల పక్షాన పని చేయడం సిగ్గుచేటని దీనికి తీవ్రస్థాయిలో విమర్శిస్తూ నియోజకవర్గ గిరిజనుల పక్షాన ఒక గిరిజన బిడ్డ గా,హైకోర్టు న్యాయవాదిగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గం యువ నాయకుడిగా జిల్లా అధికార ప్రతినిది గా గిరిజనులకు న్యాయం జరిగే వరకు గిరిజనుల పక్షాన నిలబడి పోరాడటానికి సిద్ధం గా ఉన్నామని తెలియచేస్తూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు రక్షణ, స్వేచ్ఛ, న్యాయమైన పరిపాలన అందించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెనుబల్లి రమేష్ బాబు హైకోర్టు న్యాయవాది.

Share it:

TS

Post A Comment: