CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళశాల విద్యార్థులు.కళాశాల టాపర్ గా బండారు మేరీ-- ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య

Share it:

 




మన్యం మనుగడ, మంగపేట.

మండల కేంద్రంలోని ఎక్కటి సరోజనీ శేషారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చారని కళాశాల ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య అన్నారు. ద్వితీయ సంవత్సరంలో 137 మంది విద్యార్థులు హాజరవగా 126 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 92 శాతము ఉత్తీర్ణత సాధించారు.

ప్రథమ సంవత్సరంలో 131మంది విద్యార్థులు హాజరవగా 94 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 72 శాతము ఉతీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో బండారి మేరీ BPC గ్రూప్ లో 1000 మార్కులకు గాను 960 మార్కులు సాధించి కళాశాల టాపర్ గా నిలిచింది.

1000 మార్కులకు గాను ఎంపిసి లో 928 మార్కులు సాధించి యర్రంగారి భార్గవి ద్వితీయ స్థానంలో, 1000 గాను 915 మార్కులను సాధించి మహమ్మద్ ఆస్మా తృతీయ స్థానంలో నిలిచారు. పాయం హారిక బీపీసీ లో 914, కందకట్ల ప్రసన్న బీపీసీ లో 903 మార్కులు సాధించారు.

ప్రథమ సంవత్సరంలో దంతనపల్లి మానస ఎంపిసి గ్రూపులో 470 మార్కులకు 434 (92 శాతము)మార్కులు. గుర్రాల హేమలత బిపిసిలో 440 మార్కులకు 417(95%), మార్కులను, మహమ్మద్ రోషన్ సఫ్రీన్ ఎంపిసి గ్రూపు నందు 470 మార్కులకు 412(88%) మార్కులను, బిపిసి గ్రూప్ నందు గుమ్మడాల నీలిమ 406/440,గుడ్డేటి అఖిల 400/440 మార్కులను సాధించారు.

ఇంటర్ ఫలితాలలో ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య మరియు అధ్యాపక బృందము శాలువా మరియు మెమోంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గూళ్ల వెంకటయ్య అధ్యాపక బృందము రేణుకాదేవి, జ్యోతిర్మయి, సంతోషకుమార్, శైలేందర్,లక్ష్మణ్, అశోక్, సతీష్ కుమార్,అనిల్ కుమార్, చిరంజీవి, శ్యామ్ మరియు నరేష్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: