CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దళితుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు .

Share it:

 


మన్యం మనుగడ, కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు మంగళవారం నాడు కరకగూడెం గ్రామానికి చెందిన మండల టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టి మల్ల ప్రవీణ్ కుమార్ కి దళిత బంధు పథకం కింద మంజూరైన ట్రాక్టర్ ను శ్రీ రేగా కాంతారావు గారు ప్రారంభించారు...

 ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు మాట్లాడుతూ...

 దళితులు ఆర్థికాభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ గారు లక్ష్యమని, అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల కోసం దళిత బందు పథకాన్ని తీసుకుచ్చారని అన్నారు...

 బంగారు తెలంగాణలో దళితులందరూ ఆర్థికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రవ్యాప్తంగా దళిత బందు పథకాన్ని ప్రారంభిస్తున్నారు...

 ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన 10 లక్షలతో మీ కాళ్లపై మీరు నిలబడి ఆర్థికంగా ఎదగాలని కోరారు...

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మానస పుత్రిక దళిత బంధు విజయానికి ప్రతి ఒక్కరు సంపూర్ణంగా సహకరించాలని కోరారు...

 ఇందుకోసం అనుగుణంగానే దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు పాటు పడుతున్నారని చెప్పారు, ముఖ్యంగా దళితుల జీవితాలలో వెలుగు నింపి భావితరాలకు బంగారు బాట వేయాలనె దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు సాగుతున్నారని కొనియాడారు.

 దళిత బంధు పథకంలో మంజూరైన వాహనాన్ని సరైన మార్గంలో వినియోగించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు...

ఈ కార్యక్రమంలో కరకగూడెం మండలం టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: