CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దుమ్ముగూడెం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్మన్.. పల్లె ప్రగతి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::


దుమ్మగూడెం మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య లు మంగళవారం పర్యటించారు చిన్న బండిరేవు గ్రామపంచాయతీ లో పల్లెప్రగతి పనులు ప్రకృతి వనాలను వారు పరిశీలించారు ఐదు లక్షల రూపాయల జడ్పిటిసి నిధులతో చేపట్టిన సి సి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు చిన్న బండిరేవు గ్రామంలో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. చిన్న బండిరేవు గ్రామంలో నున్న ఎస్సీ కాలనీ కు మిషన్ భగీరథ నీళ్లు సరిగా సరఫరా అవ్వట్లేదు అని మహిళలు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అలాగే కాలనీలో ఉన్న రహదారిని నూతనంగా నిర్మించాలని కొత్త అంగనవాడి బిల్డింగ్ ను నిర్మించాలని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా పై మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని నిధులు మంజూరు చేసేలా చర్యలు చేపడతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం పెద్ద నల్లబెల్లి గ్రామం వద్ద పల్లె ప్రగతి కార్యక్రమం లో వారిరువురూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం పి పి రేసు లక్ష్మి జడ్పిటిసి తెల్లం సీతమ్మ ఎంపీడీవో చంద్రమౌళి తహసిల్దార్ చంద్రశేఖర్ ఎంపీవో ముత్యాలరావు పలువురు సర్పంచులు కార్యదర్శులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: