CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల తో నిరుపేదల సొంతింటి కల సహకారం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.40 మంది లబ్ధిదారులకు డ్రా పద్దతిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు:విప్ రేగా

Share it:


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మంగళవారం నాడు మణుగూరు మండలం లోని తోగ్గుడెం గ్రామంలో నిర్మించిన 40 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి 40 మంది లబ్ధిదారులను విప్ రేగా కాంతారావు,అధికారులు, ప్రజాప్రతినిధుల,సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. పేదల సొంతింటి కల నెరవేరింది అన్నారు.నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని వారు తెలిపారు.నిరు పేదలకు డబుల్ బెడ్ రూమ్ సొంత ఇల్లు కల సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు రుణపడి ఉండాలన్నారు.గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లాటరీ ద్వారా కేటాయించినట్లు వివరించారు. అదే విధంగా జూన్ 9 తేదీ నాడు లబ్ధిదారులకు ఇండ్లకు కేటాయిస్తామన్నారు.టిఆర్ఎస్ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పినపాక నియోజకవర్గం లో సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ నాయకత్వంలో నిధులకు కొరత లేకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.ఇప్పటికే కొన్ని పనులు పూర్తి చేసుకుని ప్రారంభించుకున్నామని తెలిపారు.పినపాక నియోజకవర్గం లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి లో ముందుకు సాగుతున్నామని, గ్రామాలలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుతమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఎంపీపీ కారం.విజయకుమారి, జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, తహసీల్దార్ నాగరాజు, పీఏసీఎస్.ఛైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,తోగ్గుడెం సర్పంచ్ బొగ్గం.రజిత,స్ధానిక ప్రజాప్రతినిధులు,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,మణుగూరు మండల రెవెన్యూ అధికారులు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,పార్టీ సీనియర్ నాయకులు,యువజన నాయకులు,డబుల్ బెడ్రూం లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: