CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

Share it:

 మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మంగళవారం నాడు విద్యాశాఖాధికారి వేల్పుల వీరస్వామి తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మణుగూరు, పినపాక,బూర్గంపాడు,అశ్వాపురం,మండలాలకు సంబంధించి మన ఊరు మన బడి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,విద్యారంగంలో సమూల మార్పులు తీసుకు వచ్చేందుకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు,మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కై రాష్ట్ర ప్రభుత్వం రూ.7238 కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలన్నారు.ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో జరుపుకోవాలని సూచించారు.ఈ విద్యా సంవత్సరం నుంచే పాఠశాలల్లో ఆంగ్ల మాథ్యం పై విద్యా బోధన జరుగుతుందని గుర్తుచేశారు. అందుకు ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చేలా ప్రోత్సహించాలన్నారు.

Share it:

TS

Post A Comment: