CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నాడైనా నేడైనా పినపాక నియోజకవర్గ అభివృద్ధికి ఆయన దిక్సూచి.తొలిసారి ఎమ్మెల్యే గా పని చేసిన కాలం లో పినపాక నియోజకవర్గానికి భారీగా నిధులు

Share it:

 


  • రేగా రాక తో మారిన పినపాక నియోజకవర్గ రూపురేఖలు
  • రెండోసారి గెలవడంతో రెట్టింపు ఉత్సాహంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి
  •  పినపాక నియోజకవర్గానికి వేలకోట్ల నిధుల వరద

గుండాల జూన్ 17(మన్యం మనుగడ): పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడి పినపాక ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కి ముమ్మాటికీ వర్తిస్తుంది. ప్రజా సేవకుడు అంటే ఎలా ఉండాలో అంటే రేగా తపన చూస్తే అర్థమవుతుంది. ప్రజలతో మమేకమై అసాధ్యమైన సమస్యలను తక్షణమే పరిష్కారం చూపెడుతూ నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ పలువురు ఎమ్మెల్యేలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. పినపాక నియోజకవర్గం లో ఏ ఒక్క ప్రాంతంపై వివక్షత చూపకుండా ఏడు మండలాలలో సమాంతర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు. రేగా పినపాక నియోజకవర్గ అభివృద్ధి నిరంతర కృషి పై మన్యం మనగడ గుండాల ప్రత్యేక కథనం .నాడైనా... నేడైనా అభివృద్ధికి ఆయన దిక్చూసి. తొలిసారి గెలవడంతోనే పినపాక నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేయించి అభివృద్ధికి బాటలు వేసిన ఘనత ఎమ్మెల్యే రేగా కాంతారావు కి దక్కుతుంది. మరల 2018లో రెండోసారి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అభివృద్ధిలో తనదైన శైలిలో దూసుకుపోతున్న నియోజకవర్గానికి భారీగా నిధులను మంజూరు చేయించారు. ఇప్పటికే నియోజకవర్గానికి వేల కోట్లు మంజూరు చేయించి ప్రతి పల్లెకు రహదారి సౌకర్యాన్ని కల్పించారు. నాడు ఆయనే అభివృద్ధికి ప్రదాత అయ్యారని మళ్ళీ నేడు అభివృద్ధిలో ముందుండి నడిపిస్తున్నాడు అని నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు పినపాక నియోజకవర్గానికి పది కాలాల పాటు సేవలు అందించాలని నియోజకవర్గ ప్రజలు మహిళలు యువత కోరుకుంటున్నారు.

Share it:

TS

Post A Comment: