CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాజుపేటలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం రాజుపేట గ్రామం లో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెరాస పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా తెరాస జిల్లా నాయకులు, మండల, గ్రామ నాయకులు పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తెలంగాణా ప్రజల చిరకాల వాంఛ అటువంటి కలలను సాకారం చేసుకొనెందుకు ఎందరో విద్యార్థుల ఆత్మ బలిదానాలు సైతం అర్పించిన సంఘటనలు కోకొల్లలు, తెలంగాణా రాష్ట్రము సిద్దించుటకు ప్రజలు తొలి దశ ఉద్యమం 1969లో నిర్వహించడం జరిగింది, ఆ ఉద్యమం లో విద్యార్థులు రాజకీయ నాయకులు ఉద్యోగ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పడి పోరాడారు అయినను తెలంగాణా సిద్ధించలేదు, మరల ప్రొఫెసర్ జయ శంకర్ సార్ ఆధ్వర్యంలో తెలంగాణా మలి దశ ఉద్యమం మొదలు అయినా ఆ ఉద్యమానికి ఊపిరిలూది పిడికిలి బిగించి జై భోలో తెలంగాణా అంటూ ఉద్యమించి తెలంగాణా తెచ్చుడో కెసిఆర్ చచ్చుడో అంటూ మొండి ఘటం పట్టి 2009 లో ఆమరణ నిరహార దీక్ష చేపట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కెసిఆర్, అటువంటి తెలంగాణా తెచ్చిన జాతి పిత కెసిఆర్ కు మన ఎల్లప్పుడూ రుణ పడి ఉండాల్సిందే, తెలంగాణ అంటే ఏ ఒక్కరికోసమో కాదు అంటూ తెలంగాణ కాంక్షను చిన్న పిల్లల నుండి పండు ముదుసలి వరకు పిడికిలి బిగించి జైభోలో తెలంగాణా అంటూ నినదించి అనేక ఉద్యమాలు చేయటానికి అసలు కారకుడు కెసిఆర్. కెసిఆర్ చిరకాల స్వప్నం తెలంగాణా, నీళ్లు, నిధులు, నియామకాలు కోసం మన తెలంగాణా మనం తెచ్చుకొని 8 వ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు మనం జరుపుకోవటం ఎంతో గర్వించదగ్గ విషయం అంటూ తెలంగాణా కోసం పాటు పడిన ప్రతి ఒక్కరిని స్మరించుకొంటూ జై భోలో తెలంగాణా అంటూ అందరూ ముక్త కంఠంతో నినదించారు. ఈ కార్యక్రమం లో యడ్లపల్లి నరసింహ రావు,మలికంటి శంకర్,కర్రీ శ్యాంబాబు,హరి బాబు, చదలవాడ సాంబశివరావు, రాయసాబ్, విశ్వేశ్వరరావు,భాషా,పేరయ్య, నిమ్మగడ్డ ప్రవీణ్,మోదుగు బాబు,కర్రీ కేశవరావు, రమేష్, కిరీటం, వెంకట రత్నం, హుస్సేన్,వెంకన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: