CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు రాజు కావాలి...గ్రామాలు సుభిక్షంగాఉండాలి. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఏరువాక పున్నమి వేడుక.

Share it:


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

రైతు బావుంటే నే దేశం బావుంటుంది అని, అప్పుడే జై జవాన్.. జై కిసాన్ అని గర్వంగా నినదించగలమని తెలిపారు బూర్గంపాడు వ్యవసాయ శాఖ అధికారి శ్రీ.రవి తేజ రెడ్డి ఈ మేరకు స్థానిక రెడ్డిపాలెం గ్రామంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు పూజోత్సవం కార్యక్రమానికి ,స్థానిక సర్పంచ్ వెంకట రామిరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ సొసైటీ సభ్యులు ఆవుల నాగిరెడ్డి కుందూరు పెద్దిరెడ్డిల తో పాటు పాల్గొని రైతులను శాలువా, పూలమొక్క ప్రశంసా పత్రం, జ్యూట్ బ్యాగ్ లతో ఘనంగా సన్మానించారు,ఈ సందర్భంగా సర్పంచ్ ,ఉప సర్పంచ్ మరియు పెద్దలు శ్రీ శంకర్ శ్రీ రోసిరెడ్డి లు మాట్లాడుతూ రైతు లేనిదే.. దేశం మనుగడ కోల్పోతుంది అని అటువంటి రైతుల కష్టాలకు గుర్తింపు గా రైతు పూజోత్సవం పేరుతో జేడీ ఫౌండేషన్ వారు కౌలు రైతులను గుర్తించి సన్మానించి ప్రశంసా పత్రం ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయం అని కొనియాడారు, తమ లాంటి చిన్న రైతులకు కూడా సర్టిఫికెట్ ఇచ్చి గౌరవించడం వల్ల మా బాధ్యత మరింత పెంచింది అని తెలిపారు ఇటువంటి కార్యక్రమం తలపెట్టిన శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారికి, జేడీ ఫౌండేషన్ కన్వీనర్ మురళీమోహన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి హన్సి, కడాలి నాగరాజు, యూసుఫ్ మియా, లతో పాటు సన్మానము పొందిన రైతులు శ్రీ గాదె పెద్దిరెడ్డి శ్రీమతి మండవ చంద్రావతి,కొండ్రోజు ఏసురాజు, నిమ్మల రాములు కొత్త వెంకట రెడ్డి, సరోజ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: