CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అప్పుల ఊబిలో తెలంగాణా రాష్ట్రం-ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేదు.అప్పుల కోసం తెలంగాణ ప్రతిష్ట ను దిగజార్చిన కేసీఆర్-మాజీ ఎమ్మెల్యే కునేంనేని

Share it:


ములకలపల్లి:(జూన్ 09)మన్యం మనుగడ ప్రతినిధి:

తెలంగాణ ప్రభుత్వం రాష్ట ప్రజల పరువును ప్రతిష్ట ను ప్రపంచం ముందు ప్రతిష్ట దిగజార్చిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కునేంనేని సాంబశివరావు అన్నారు.ములకలపల్లి లో జరిగిన సీపీఐ మండల 16 వ మహాసభ లో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, నగదు నిల్వ ల తో తెలంగాణ ప్రభుత్వం ను ప్రజలు అప్పగిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 2లక్షల కోట్ల రూపాయల అప్పు లు చేసి ఈ రాష్ట్ర ప్రజలు పై ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు అప్పుల భారం మోపారని,ఈనాడు ఉద్యోగులు కు వేతనాలు ఇచ్చే దిక్కు లేక దిక్కులు చూస్తున్నారని,తెలంగాణ ప్రజల పరువు ప్రతిష్ట తీసిన దుర్మారుగు కేసీఆర్ అని అన్నారు. రైతు బంధు జూన్ మాసం వచ్చి తొలకరి పడుతున్న నేటివరకు రైతులకు అందచెయ్యక పోవటం ఏమిటి అని ప్రశ్నించారు.అటు కేంద్రం లొ మోడీ ప్రభుత్వం మతం,దేవుడు పేరుతో రాజకీయాలు మతోన్మాదం ను ప్రేరేపించి ప్రజల పై దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని,మోడీ ప్రజలకు ఇచ్చింది ఏమీలేదని,ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తము ప్రవేట్ వాళ్లకు అమ్ముతున్నారుని తెలిపారు.ప్రజలకు ఇచ్చిన హామీ అమలు కోసం సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు.సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ పోడు భూములు కు పట్టాలు ఇవ్వాలి, డబుల్ బెడ్ రూమ్స్,పెన్షన్, నిరుపేదలకు భూముల 3 ఎకరాల భూమి,ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.ఈ మహాసభ కు కొర్రీ భద్రం, జబ్బార్,ఈర్ల వెంకటరమణ అధ్యక్షత వహించారు.ఈ మహాసభలు కు సీపీఐ జిల్లా నాయకులు ముత్యాల విశ్వనాధం,నరటి ప్రసాద్, వై భాస్కరరావు,పూర్ణ చంద్రరావు,యూసుఫ్,సందీప్,సాయి, వీరు,పుష్పవతి,వెంకటమ్మా, అంగోత్ నాగేశ్వరరావు,రంజిత్,గంటా రాఘవులు,వెంకటరెడ్డి,గొడ్ల కొండయ్య, మిరియాల వెంకన్న,సడియం వెంకటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: