CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జమ్మిగూడెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర ఏర్పాట్లు.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, జమ్మిగూడెం గ్రామంలో ఆదివాసి నాయకపోడ్లు నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర సోమవారం నుండి 5 రోజులు నిర్వహణ ఉండగా, వారం ముందుగానే జాతర ఏర్పాట్లు వేగవంతం చేశారు. కొర్రాజుల స్వామి ప్రత్యేక ఆలయ నిర్మాణం, జాతర జరిగే ప్రాంగణంలో ట్రాక్టర్ తో చదునుచేశారు. ఈ సందర్భంగా జమ్మిగూడెం మాజీ సర్పంచ్లు ముద్దిన రాములు, ముద్దిన కొండయ్య లు మాట్లాడుతూ ఐదురోజుల పాటు జరిగే ఈ శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర ఆదివాసీ గిరిజన నాయకపోడు సంస్కృతి సాంప్రదాయాలతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారని వారు తెలిపారు. ఈ యొక్క జాతర మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ మెంబర్స్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: