CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అభివృద్ధికి అందలం తెరాస ప్రభుత్వం.టిఆర్ఎస్ పార్టీ వాజేడు మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పూసం నరేష్ కుమార్.

Share it:


మన్యం మనుగడ వాజేడు జూన్ 3:

గ్రామ పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులకు వంద శాతం బిల్లులు అందినవి, ప్రతిపక్ష పార్టీలు ఉద్యేశపూర్వకంగా విమర్శలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎంజిఎన్ఆర్ఇజిఎస్, నుండి కేంద్ర ప్రభుత్వం సుమారు 1400 వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంచింది . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు వంద శాతం బిల్లులు చెల్లింపులు చేపట్టిందనీ వాజేడు మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు పూసం నరేష్ కుమార్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఉద్యేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తు, రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా గ్రామాలలో చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తుదన్నారు. కేంద్ర ప్రభుత్వం సుమారు 1400 కోట్ల రూపాయలు చెల్లించకపోవడం వలన గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుంటే ఆ విషయం తెలియని బీజేపీ, మిగతా ప్రతి పక్షాలు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని అనడం ఎంత విడ్డూరం అని అన్నారు కెసిఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రతిపక్షాలు అయినా మీ ఇంటికీ అందలేదా మీరు తీసుకోలేదా మీ మనసాక్షి నీ అడిగి తెలుసుకొవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న సర్పంచులు గ్రామాల అభివృద్ధి కొరకు పనిచేస్తుంటే లేనిపోని విమర్శలు చేస్తూ, ప్రజలను మబ్బెపెట్టే ప్రయత్నం చేసే ప్రతి పక్షాలును ప్రజలు త్వరలోనే సరైన గుణపాఠం చెపుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే 5 వ విడత పల్లె ప్రగతి కార్యక్రమములో భాగంగా వాజేడు మండల సర్పంచులు ,ప్రజాప్రతినిధులుప్రజలు, అధికారులు మీడియా మిత్రులు,సహాయ సహకారాలతో గ్రామాలలో ఉన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించి గ్రామాలను అభివృద్ధి పథంలో వాజేడు మండలంను జిల్లా లో ప్రధమ స్థానంలో నిలేచెందుకు కృషి చేస్తామని పత్రిక ముఖంగా వాజేడు మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు పూసం నరేష్ కుమార్ తెలిపేరు.

Share it:

TS

Post A Comment: