CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అన్నపూర్ణ సీడ్స్ సేవలు అభినందనీయం.జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

Share it:


  • శనిగకుంట అగ్ని ప్రమాద బాధిత రైతు కుటుంబాలకు రూ'' లక్ష విలువైన వరి విత్తనాలు మరియు రూ 25,000 విలువైన సూక్ష్మపోషక ఎరువులు ఉచితంగా పంపిణీ.

మన్యం మనుగడ, మంగపేట.

అన్నపూర్ణ సీడ్స్ అండ్ ఫామ్స్ సేవలు అభినందనీయమని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన మంగపేట మండలం శనిగకుంట గ్రామానికి చెందిన గిరిజన రైతు కుటుంబాలకు వరంగల్ లోని అన్నపూర్ణ సీడ్స్ అండ్ ఫామ్స్ యజమాని చందుపట్ల వేణుగోపాల్ రెడ్డి లక్ష రూపాయలు విలువైన వరి విత్తనాలను అందజేయగా సాంబశివ రెడ్డి ఆదివారం ముఖ్య అతిథిగా హాజరై బాధిత రైతులకు వరి విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ అన్నపూర్ణ సీడ్స్ అండ్ ఫామ్స్ యజమాని చందుపట్ల వేణుగోపాల్ రెడ్డి రూపాయలు ఒక లక్ష విలువైన పౌండేషన్ తరగతి సాంబమసూరి బిపిటి-5204 వరి విత్తనాలను బాధిత గిరిజన రైతు కుటుంబాలకు ఉచితంగా అందజేయడం అభినందనీయమని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గతంలో అకాల వడగళ్ల వర్షం కురిసి పంట నష్టం వల్ల గుండెపోటుతో మరణించిన రైతు కుటుంబాలకు అన్నపూర్ణ సీడ్స్ అండగా నిలబడిందని వారి సేవలను ఆయన కొనియాడారు. వరి విత్తనోత్పత్తి మరియు పంపిణీలో అన్నపూర్ణ సీడ్స్ అందెవేసిన చేయి అని అభివర్ణించారు రైతులంతా ఈ విత్తనాలతో సుమారు 150 ఎకరాల్లో వరి సాగు చేసుకోవచ్చునని సాంబశివ రెడ్డి సూచించారు. వికాస్ అగ్రి ఫౌండేషన్ సంస్థ నుండి రూపాయలు 25,000 విలువైన సూక్ష్మ పోషక ఎరువుల కిట్లు ఈరోజు పంపిణీ చేసినట్లు తెలిపారు. వరి నారు యాజమాన్యం వాటికి అవసరమైన సూక్ష్మ పోషక ఎరువులు మరియు విత్తనశుద్ధికి అవసరమైన మందులను ఈరోజు రైతులకు ఉచితంగా పంపిణీ చేశామని అన్నారు. శనగకుంట బాధిత రైతులకు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు వివరించారు గతంలో తొలి విడతలో రూపాయల ఒక లక్ష విలువైన పరదాలు రెండో దశ రూపాయలు 75 వేల విలువైన నూతన వస్త్రాలను తాము పంపిణీ చేశామన్నారు.ఈరోజు మూడవ విడతలో రూపాయల ఒక లక్ష విలువైన వరి ధాన్యం విత్తనాలతో పాటు రూ 25 వేల విలువైన ఎరువులను అందించటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. బాధిత కుటుంబాలకు మొత్తం రూపాయలు మూడు లక్షల సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేసినట్లు శనిగకుంట గ్రామ ప్రజల హర్షధ్వానాల మధ్య సాంబశివ రెడ్డి తెలిపారు. ఆపద సమయంలో తాను అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మంగపేట రైతు సేవా సహకార సంఘం ఉపాధ్యక్షుడు నరసింహ సాగర్ డైరెక్టర్ కాడ బోయిన నరేందర్ శనిగకుంట బాధిత గిరిజన రైతులు తోలెం నాగబాబు తోలేం నరసయ్య మంకిడి వీరయ్య మంకిడి రాంబాబు ఇర్పచిన్నయ్య పెద్దల సరోజన పసుల మంగమ్మ వారి కుటుంబ సభ్యులు వికాస్ అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్లు చెట్టుపల్లి తిరుపతిరావు నేలపట్ల శేషారెడ్డి నరసింహ సాగర్ గ్రామస్తులు పెండ్యాల హరి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: