CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు భూముల పై హామీ ఏమైంది హక్కు పత్రాలు ఇవ్వకపోతే ఏజెన్సీలో ప్రభుత్వ పాలన స్తంభింపచేస్తాం..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం :

మండలంలోని ములకపాడు సీతారామయ్య భవన్ భద్రాచలం నియోజకవర్గ స్థాయి సిపిఎం పార్టీ తరగతులు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య , పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడుతూ పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పిన హామీ నేటికీ అమలు కాలేదని ముఖ్యమంత్రి హామీ నీటి మీద రాత లాగా మారిపోయిందని విమర్శించారు. 2021 నవంబర్ డిసెంబర్ మాసాలలో హక్కు పత్రాల కోసం పోడు సాగుదారులు వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారని ఇంతవరకు ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం చేయలేదని సెంటు భూమి కూడా హక్కు పత్రం ఇవ్వలేదని ఇంతటి అసమర్థ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని సిపిఎం నేతలు పోడు సాగు దారులకు హక్కు పత్రాలు ఇవ్వకపోతే ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ పాలన స్తంభింప చేస్తామని సిపిఎం హెచ్చరించింది. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 15 వేల కుటుంబాలు పైచిలుకు పోడు సాగు చేసుకుంటున్నారని వీరందరికీ హక్కు పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఫారెస్ట్ పోలీసులు ప్రయోగించి వేధింపులకు గురి చేస్తుందని అక్రమ కేసులు బనాయిస్తున్నారని సిపిఎం విమర్శించింది. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున బ్యాంకుల ద్వారా రైతులకు కొత్త వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కల్తీ విత్తనాలు కల్తీ ఎరువుల నివారణకు వ్యవసాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ రైతులకు నాణ్యత కలిగిన ఎరువులు విత్తనాలను చట్టబద్ధమైన ధరలకు లభించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఎలమంచిలి రవి కుమార్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బ్రహ్మచారి, ఎం బి నర్సారెడ్డి, దెబ్బకట్ల లక్ష్మయ్య, జిల్లా కమిటీ సభ్యులు మర్లపాటి రేణుక, ఎలమంచి వంశీ, సరి యం కోటేశ్వరరావు, కుమ్మరి శీను, గడ్డం స్వామి, కొప్పుల రఘుపతి, జి వాసు, సున్నం గంగ, కొరస చిలకమ్మా తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: