CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు :


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మన ఊరు మన బడి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నుంచి మంజూరైన 29 లక్షల 54 వేల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులతో, కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు రూ.7,289 కోట్ల రూపాయలు కేటాయించిందని, ప్రభుత్వ పాఠశాలలో శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి వాటి స్థానంలో కొత్త గదులు నిర్మించడం, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాల్ , నిర్మాణాలు చేపట్టడం, త్రాగునీటి సౌకర్యం , విద్యుత్ మరుగుదొడ్లు, భవనాల కు రంగులు వేయడం మరమ్మతులు చేయడం కావలసిన ఫర్నిచర్ ఏర్పాటు చేయటం, చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేసి పిల్లలకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.

ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు...

Share it:

TS

Post A Comment: