CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్వయం పాలన సమరశంఖం పూరించిన బిర్సా ముండా.

Share it:

 *




దమ్మపేట జూన్ 09 ( మన్యం మనుగడ ) : భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమాలకు కొన్ని దశాబ్దాలకు పూర్వమే ఆదివాసులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బ్రిటిష్ పాలనను భారతదేశంలో గల ఆదివాసీయేతర సమాజం ఆహ్వానించిన ఆదివాసీ సమాజం మాత్రం ప్రతిఘటించింది. రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరు గాంచిన బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచంలో అన్ని ఖండాలను పరిపాలించారు కాని ఎక్కడ ఎదురుకాని వ్యతిరేకత మన దేశంలోనే ఆదివాసీల పోరాటంతో వారికి అనుభవంలోకి వచ్చింది. దేశంలో ఆదిమ జాతి అణగారిన వర్గాల ప్రజలకు పోరాట భావాలను రగిలించిన తొలి వ్యక్తి బిర్సాముండా .


  బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా బీహార్ లో పాటు అనేక రాష్ట్రలలో ఆదివాసీల స్వయం పాలన సాధించడానికి సమర శంఖం పూరించిన తొలి ఆదివాసీ బిర్సా ముండా. తెల్లవారిని (బ్రిటిష్ పాలకులను) తరిమేయటమే జీవిత లక్ష్యంగా బీహార్ లో ఆదివాసీ సమాజం నివాసిస్తున్న దోమారి కొండల్లో 1886-1894 మధ్య విప్లవాన్ని నడిపాడు బిర్సాముండా..


  1975, నవంబర్ 15 గురువారంనాడు జార్ఖండ్ లోని ఉల్నిహతు గ్రామంలో కర్మీ ముండా, సుగానా ముండా అనే దంపతులకు మూడవ సంతానంగా బిర్సాముండా జన్మించాడు. గురువారం జన్మించడం చేత ఆయనకు 'నిర్బా' అనే పేరు పెట్టారు. ముండా అనేది సంస్కృత పదం. ముండా అనే పదానికి "పెద్దమనిషి" అని అర్ధం బిర్సాముండా తన ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత 1886న, సంవత్సరంలో మిషనరీ హైస్కూల్ చేరాడు. అక్కడ క్రైస్తవ మిషనరీల సిద్ధాంతాలు నచ్చక పోవడంతో బ్రిటిష్ పాలకులు అవలంభిస్తున్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకించాడు. భుక్తి కోసం కూలీగా పని చేశాడు బిర్సాముండా బ్రిటిష్ పాలకుల అదేశాలను వ్యతిరేకిస్తూ పన్నులు కట్టవద్దని ప్రజలకు పిలుపునిచ్చాడు ఈ పిలుపుతో ప్రజలలో చైతన్యం వెల్లివిరిసింది. భారతదేశానికి బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి కలిగిస్తానని తనతో కలిసి నడవాలని ముండా జాతికి పిలుపునిచ్చాడు. బిర్సాముండా ప్రసంగాలతో ఆదిమజాతి ప్రజలతో చైతన్యం ఉప్పెనల ఎగిసింది ఈ వాతావరణం చూసి బ్రిటిష్ పరిపాలకులు బెంబేలెత్తరు ప్రజలు పన్నులు చెల్లించడం మానివేశారు. అటవీ సంపదను దోచుకునే కాంట్రాక్టర్లను అడ్డుకున్నారు. 


బిర్సాముండా బోధనలతో 'బిర్సాయియేత్' అనే కొత్త పంథా ఒకటి ఏర్పాడింది. బిర్సాముండా నాయకత్వంలోని ఆదివాసిల తిరుగుబాటును, స్వయం పాలన ఉద్యమాన్ని అణచివేయడానికి మొదట బిర్సాముండాను నిర్భందించాలని బ్రిటిష్ పాలకులు భావించారు. ఈ విషయాన్ని పసిగట్టిన బిర్సా అనుచరులు సాంప్రదాయ అస్త్రాలతో బిర్సాకు రక్షణగా నిలిచారు. మూడురోజుల పాటు ప్రయత్నించినా ఫలించక పోవడంతో బ్రిటిష్ సైన్యం నిరాశలో వెనుతిరిగారు అదే బిర్సాముండా ఉద్యమంలో సాధించిన మొదటి విజయం. తరువాత బిర్సా అనుచరులలో మరియు ఆదిమజాతీ ప్రజలలో మరింత చైతన్యం కలిగింది. అది చూసి తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టింది. అయితే ఈ తిరుబాటును, ఉద్యమాన్ని అణచి వేయలంటే బిర్సాను అంతమొందించడం ఒక్కటే మార్గమని బ్రిటిష్ పాలకులు భావించి బిర్సాను పట్టించిన వారికి బహుమానం ప్రకటించారు. ఒకరోజు రాత్రి బ్రిటిష్ సైన్యం ఆయుధాలతో వచ్చి బిర్సాముండాను బంధించి తీసుకువెళ్ళారు రాంచి కారాగారంలో బిర్సాముండాను నిర్బందించి చిత్రహింసలు పెట్టారు. 1900 సంవత్సరంలో తీవ్రమైన రక్తపు వాంతులతో వైద్యం అందక బిర్సా తనువు చాలించాడు. ఆదిమజాతి ప్రజల "స్వయం పాలన" కోసం ఆయన బలి అయ్యాడు. బిర్సాముండా గారి జన్మదినం నవంబర్ 15న దేశ వ్యాప్తంగా "జన జాతీయ గౌరన దివాస్" నిర్వహించాలని కేంద్ర కేబినెట్ ఇటివలే నిర్ణయించింది. అయితే ఇప్పటి పాలకుల పరిపాలనలో ఆదివాసుల రక్షణ, భద్రత కరువై విభజనలు, విచ్ఛిన్నాలు కొనసాగుతూ అల్ప సంఖ్యాకులుగా మారుతూ అస్థిత్వాన్ని, సంస్కృతిని, భాషని, ఆదిమజాతులను, సహజ సంపదను, భూబాగాన్ని గణనీయంగా కోల్పోయారు. చివరికి మనుగడ కోసం ఆదివాసీలు పోరాడుతున్నారు. అంతరించిపోయే ప్రమాదపు అంచుల్లో ఉన్న ఆదివాసులు చారిత్రకంగా జరిగిన వంచన, దోపిడీ, అణచివేతను పునరావృతం కానీయకుండా ఆదివాసి సమాజం నివశిస్తున్న ప్రాంతాలను కలుపుకు 'స్వయం పాలన' రాజ్యాధికారం కలిగి - ఉండటం ద్వారా మాత్రమే వారి సంస్కృతి, హక్కులు రక్షింపబడి, ఆదివాసుల సమస్యలు పరిష్కారమవుతాయి.




వంకా వరాలబాబు. ఏం.ఫిల్,

పరిశోధక విద్యార్థి,

మద్రాసు యూనివర్సిటీ.

Share it:

TS

Post A Comment: