CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఛలో ప్రగతిభవన్ పాదయాత్రను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు• పోలీసులకు..గిరిజనులకు మధ్య తోపులాట.

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట:తమ సమస్యలు పరిష్కారానికై నేరుగా ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లడానికై అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామస్థులు ప్రగతిభవన్ వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన విషయం విధితమే. ఎంపీపీ, ఎంఎల్ఏ హామి ఇచ్చినప్పటకి పాదయాత్ర చేపట్టటానికే గ్రామస్ధులు నిర్ణయించారు. ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు రామన్నగూడెం సమూహం అయి, అధికార పార్టీ జెండాలు, ఫ్లెక్స్ లు పట్టుకొని బయలుదేరారు. ఈ సందర్భంగా నాయకత్వం వహిస్తున్న మడకం నాగేశ్వరరావు మాట్లాడుతూ తాము తమ సమస్యలు పరిష్కారానికి 13 సంవత్సరాలు వేచి యున్నామని, హమీలకే పరిమితమవుతున్నాయని, అందుకే నేరుగా తమ సమస్యలను ముఖ్యమంత్రి కి చెప్పుకొందామని, శాంతియుతంగా బయలుదేరినట్లు తెలిపారు. బోర్డర్ వద్ద పోలీసులు వీరిని నిలిపివేసారు. అనుమతి లేదని లా&ఆర్డర్ సమస్య అవుతుందని, ఎమ్ఎల్ఎ, కలెక్టర్ మీ సమస్యలు గురించి మాట్లాడుతున్నారని సిఐ బాలకృష్ణ వివరిస్తు నచ్చచెప్పారు. అయినా గ్రామస్థులు వినకుండా ముందుకు కదలడానికి ప్రయత్నించగా వారిని రోప్ తో నిలిపివేసేందుకు ప్రయత్నించారు. నిలపివేసే సమయం లొ పోలీసులకు పాదయాత్ర చేస్తున్న గిరిజనులకు మద్య తీవ్ర వాగ్వివాదంతో పాటు తీవ్ర తోపులాట చోటుచేసుకొంది, ఇదిలా ఉండగా పాదయాత్రను భగ్నంచేయడానికి నాయకత్వం వహిస్తున్న సర్పంచ్ స్వరూప, నాగేశ్వరరావులను ముందస్తు అరెస్ట్ చేయడానికి పోలీసులు రామన్నగూడెం వెళ్లగా నాగేశ్వరరావు దొరకలేదు. మహిళా సర్పంచ్ స్వరూపను, గ్రామస్థులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తెచ్చారు. అయినప్పటికీ ఈ ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. పోలీసులు అడ్డుకొని గ్రామస్థులను అరస్ట్ చేసి. స్టేషన్కు తరలించారు. ఎంపీపీ చెప్పినట్లు విననందునే అరెస్ట్ చేసారని, శాంతియుతంగానే పాదయాత్ర చేస్తామని ఎమ్ఎల్ఎ కు చెప్పామని తెలిపారు. తమ డిమాండ్ లను నెరవేర్చే వరకు ఊరుకోమని వారు తెలియచేసారు.

Share it:

TS

Post A Comment: