CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏజెన్సీ ప్రాంతంలో చెరువుల పై హక్కు-ఆదివాసీలదే.మత్య్స శాఖ కమిషనర్ లచ్చిరామ్ నాయక్, ఏటూరు నాగారం ఆత్మ చైర్మ న్ దుర్గం రమణయ్య.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మత్య్స పరిశ్రమను అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీలను ఏర్పాటు చేయటంలో భాగంగా ఏటూరునాగారం ఐటీడీఏ పేసా జిల్లా కో ఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివాసీలకు అవగాహన సదస్సును ఏటూరు నాగారం మండల కేంద్రంలో ని బి.ఆర్ పంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సదస్సుకు రాష్ట్ర మత్య్స శాఖ కమిషనర్ లచ్చిరామ్ నాయక్,ఏటూరు నాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రామయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.మత్య్స సొసైటీలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలోని (పేసా చట్టం)లో బడే గిరిజన సొసైటీలను ఏర్పాటు చేస్తామని చెరువుల పై చేపలు పట్టే హక్కు భారత రాజ్యాంగం లోబడి ఆదివాసీ గిరిజనులకు మాత్రమే ఉందని అన్నారు. ములుగు,భూపాలపల్లి, మహుబుబాబాద్,వరంగల్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు హాజరై వారు సమస్యలను వివరించుకున్నారు.పూర్తి ఏజెన్సీ ప్రాంతాలో ఉన్న చెరువులకు రిజార్వ్ పారెస్టు లో ఉన్నటువంటి చెరువులకు పరెస్టు అధికారులు సొసైటీలు చేయకుండా అడ్డు పడుతు న్నారని విన్నవించు కున్నారు.

అదేవిధంగా (ROFR) హక్కు పట్టా కలిగిన భూములలో కూడా స్వంత చెరువుల త్రవ్వు కోకుండా అడ్డుపడుతున్నారని, ఆదివాసీలు సాగు చేసుకునే అసైన్డ్ భూములకు ( 1)

ఎకరానికి కూడా స్వంత చెరువులు త్రవ్వు కొనుటకు సబ్సిడీ వచ్చే విదంగా కృషి చేయాలని రైతులు కోరారు.సొసైటీల సభ్యుల సమస్యలను సానుకూలంగా స్పందిస్తు గిరిజన సొసైటీ పారిశ్రామిక సహకార సొసైటీ సబ్యులకు 60%రాయితీతో, ద్విచక్ర, వాహనాలు ,లాగేజ్ ఆటోలు,సంచార చేపల అమ్మకపు వాహనాలు, ఇన్స్ లేటెడ్ ట్రక్కులు,వలలు,ప్లాస్టిక్ కిట్లు,తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి దారులకు అందజేయడం జరుగుతుంది అన్నారు.అంతే కాకుండా మహిళ మత్య్స సహకార సొసైటీలను కూడా ఏర్పాటు చేసుకుని అవకాశం ఉందన్నారు. సొసైటీ సభ్యులకు ప్రమాద వశాత్తు మరణించిన 5లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి భీమా వర్తిస్తుందని సంఘ సభ్యులు గాయపడి అంగ వైకల్యం జరుగుతే 2లక్షల రూపాయలను అందిస్తున్నదని అన్నారు.ఇంకా ఎటువంటి చెరువులు ఉన్న వాటికి త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో  

డి సి ఓ మలోత్ సర్దార్ సింగ్, మత్య్స శాఖ ఫీల్డ్ ఆఫీసర్ రమేష్,ములుగు జిల్లాలోని 112 ఏజెన్సీ గ్రామ పంచాయ తీల పేసా మొబలైజర్స్ మత్య్స సొసైటీ ములుగు జిల్లా ఏటూరునాగారం మండల సభ్యులు చేపను(బొచ్చె) బహుకరించారు.వరంగల్ జిల్లా సొసైటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.ఈ కార్య క్రమంలో వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్, మేడారం ట్రస్టు బోర్డ్ మాజీ చైర్మన్ రేగా నర్సయ్య,మడి సాయిబాబా,మల్లెల రాంబాబు,విక్రమ్,గొంది నగేష్,ఇర్ప రాజు,ఎట్టి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: