CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణా క్రీడా ప్రాంగణం ఏర్పాటు యువత కు, భవిష్యత్ తరాలకు ఒక గొప్ప వరం--:జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్

Share it:


ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ తన పర్యటన లో భాగంగా మంగపేట మండలం లోని పలు గ్రామ పంచాయతీ లు సందర్శించి పల్లె ప్రగతి, క్రీడా ప్రాంగణం ఏర్పాట్లు, పల్లె ప్రగతి కార్యక్రమాలు పరిశీలించారు.ఈ పర్యటన లో భాగంగా మండలం లోని రాజుపేట లో ప్రారంభించిన తెలంగాణ క్రీడా మైదానం ఏర్పాట్లు పరిశీలించి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉపేంద్ర కు, గ్రామ పంచాయతి అభివృద్ధికి ప్రజల సహకారం తీసుకొని గ్రామ పంచాయతిని అభివృద్ధి చేయాలని ఎవరికీ భయపడవలసిన అవసరం లేదని చేసే పనుల్లో పారాదర్శకత ఉండాలని,అభివృద్ధి కి తొడ్పడాలని తగు సూచనలు చేశారు. జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ చేతుల మీదుగా తెలంగాణా క్రీడా ప్రాంగణం లో వాలీబాల్ ఆటను ప్రారంభించటమే కాకుండా తాను సైతం ఆడి ఆటను ఆస్వాదించారు. తెలంగాణా క్రీడా మైదానాల ఏర్పాటు గ్రామీణ యువతీ యువకులకు ఒక గొప్ప సువర్ణ అవకాశం అని చదువు తో పాటు క్రీడలు మనిషి కి ఎంతో అవసరం అని భావితరాల భవిష్యత్ కు క్రీడా మైదానాలు తొడ్పతాయి అని, శారీరక దారుడ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయి, ఆటలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని, ఇప్పుడు ఉన్న పోటీ పరీక్షలకు దేహదారుఢ్యం, శారీరక, మానసిక ఆరోగ్యం అవసరం అని అటువంటి ఉద్యోగాలకు ఇటువంటి క్రీడా మైదానాలు ఎంతో ఉపకరిస్తాయి అని సూచించారు.తెలంగాణా క్రీడా ప్రాంగణం ఏర్పాట్లు తెలంగాణా ప్రభుత్వం గ్రామీణ ప్రజల కోసం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం అని తెలియజేశారు. రాజుపేట గ్రామ పంచాయతీ ప్రజలు ఈ సందర్బంగా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ ను గ్రామ పంచాయతీ పల్లె ప్రగతి లో భాగంగా అభివృద్ధి కోసం తెలంగాణా క్రీడా మైదానాన్ని మినీ స్టేడియం గా చేయాలని కోరగా ఇప్పుడు ఉన్న క్రీడా మైదానాన్ని మినీ స్టేడియం గా నిర్మాణం చేయడానికి కావాల్సిన నిధులు సమకూరుస్తామని, ఎంత ఖర్చు అయినా వెనుకాడే ప్రసక్తే లేదని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులతో ప్రజల సమక్షంలో మాట్లాడారు. రాజుపేట గ్రామ పంచాయతీ ప్రజలు అడగటమే వెంటనే స్పందించి వరాల జల్లు కురిపించిన జడ్పీ చైర్మన్ కు ప్రజలు తమ ఆనందాన్ని, సంతోషాన్ని చప్పట్లు హర్షధ్వనులతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో భాగంగా జడ్పీ చైర్మన్ క్రీడా ప్రాంగణం లో మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరి రక్షించాలని సూచించారు. మొక్కలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని, మొక్కలంటే కన్పించే దైవం అని నీడను, పండ్లను, ఇస్తూ సకల జీవ కోటికి ప్రాణ వాయువును అందిస్తూ సకాలంలో వర్షాలు రావడానికి తొడ్పడుతూ బహుళ ప్రయోజనం కల్గిన మొక్కలను ప్రతి ఒక్కరు నాటి వాటిని కాపాడాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ తో పాటు, జిల్లా నాయకులు పోరిక గోవిందానాయక్,మంగపేట మండలం పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, మంగపేట మండలం తెరాస పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, ములుగు జిల్లా జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రి శ్యాంబాబు,ముఖ్య నాయకులు యడ్లపల్లి నరసింహరావు, పోలిన హరిబాబు, మలికంటి శంకర్,గ్రామ అధ్యక్షులు చదలవాడ సాంబాశివారావు, రాయసాబ్, హుస్సేన్, యువనాయకులు నిమ్మగడ్డ ప్రవీణ్, కర్రి శ్రీనివాస్, కేశవరావు, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: