CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మమ్మల్ని పోడు చేసుకోనివ్వండి. -ఐటీడీఏ వద్ద కొండరెడ్ల ఆందోళన, -ఏపీవో డేవిడ్ రాజు కు వినతి పత్రం అందజేసిన కొండరెడ్లు.

Share it:



 మన్యం మనుగడ, అశ్వారావుపేట: ఆదివాసి కొండరెడ్ల సంఘం జిల్లా నాయకులు ఉమ్మల దుర్గా రెడ్డి నాయకత్వంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులపై ఫారెస్ట్ అధికారులు కొనసాగిస్తున్న అక్రమ దాడులను నిలిపివేయాలని భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఏ పి ఓ డేవిడ్ రాజ్ కు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఆదివాసి కొండరెడ్ల నాయకులు మాట్లాడుతూ మేము గత 30 సంవత్సరాలుగా బండారు గుంపు, నడిమిరెడ్డిగూడెం గ్రామ పంచాయితీ పరిధిలో దమ్మపేట ఫారెస్టురేంజ్, మల్కారం బీటు మరియు పూసుకుంట బీటు పరిధిలో సుమారు 350 ఎకరములు 150 కుటుంబాలకు చెందిన కొండరెడ్లు పోడుకొట్టి వ్యవసాయం సాగుచేసుకుంటున్నాము. ఇట్టి వ్యవసాయం మీదనే మేము ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాము. కానీ మేము సాగుచేసుకుంటున్న భూములకు ఫారెస్టు అధికారులు ప్రతి పంట సమయంలో దౌర్జన్యం చేస్తూ పంటలు వేయకుండా ఆపుతున్నారు. గత 2 సంవత్సరాల నుండి ఈ విధంగానే మమ్ములను వ్యవసాయం చేసుకోకుండా మమ్ములను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 6 నెలల క్రిందట ఇట్టి భూములు రెవిన్యూ మరియు ఫారెస్టు వారు జాయింట్ సర్వే చేసి, పట్టాలు మంజూరు చేస్తామని గ్రామసభ నిర్వహించి, దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. కావున తమరు మా కొండరెడ్ల యందు దయవుంచి, గత 30 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న భూములను సర్వే చేయించి మాకు పట్టాలు మంజూరు చేసి, పంటలు వేయకుండా దౌర్జన్యం చేస్తున్న ఫారెస్టు అధికారుల మీద చర్యలు తీసుకోగలరని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చిప్పల భద్రారెడ్డి, బొల్లు సోమిరెడ్డి, యాట్ల ధనలక్ష్మి, చిప్పల వెంకన్నబాబు, చిప్పల నాగమణి, రాజిరెడ్డి, నాగిరెడ్డి, పుష్ప, యాట్ల పుష్ప. చిప్పల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: