CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నివాసాలు ఏర్పాటు చేసుకున్న నిరుపేదలకు సిపిఐ పార్టీ అండ.

Share it:

 


 దమ్మపేట జూన్ 25 ( మన్యం మనుగడ ) : నిరుపేదలైన నూట ఇరవై కుటుంబాలు మే 14వ తారీఖున నివాసాలు ఏర్పాటు చేసుకొని కాపురం ఉంటున్నారు జూన్ 20 వ తారీఖున స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ 120 కుటుంబాలను సర్వే చేసి అధికారులకి సమర్పించినారు 24 వ తారీఖున ఉదయం ఆరు గంటలకే రెవిన్యూ ఇన్స్పెక్టర్ మరియు రెవెన్యూ సిబ్బంది తో నివాస కుటుంబంల వద్దకు వెళ్లి మీరు తక్షణం తొలగించాలి లేనియెడల మేమే తొలగిస్తామని హెచ్చరించారు వారికి బాసటగా సిపిఐ నాయకులు యర్లగడ్డ భాస్కర్ రావు మరియు కార్యకర్తలు అండగా నిలిచి ఇల్లు తొలగించకుండా నిలబడ్డారు అనంతరం స్థానిక అశ్వారావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు ఇంటి వద్దకు వెళ్లి నివాస వాసుల సమస్యలను వివరించారు వారు సానలుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తానని నేను దమ్మపేట తాసిల్దార్ జిల్లా కలెక్టర్ గారి తో మాట్లాడతానని తెలిపినారు ఈరోజు ఉదయం స్థానిక తాసిల్దార్ రంగా ప్రసాద్ గారికి నివాస వాసులు లిఖితపూర్వకంగా మెమోరాండం సమర్పించారు ఎమ్మార్వో గారు స్పందించి అధికారులతో మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి నారు అనంతరం సిపిఐ నాయకులు యర్లగడ్డ భాస్కర్ రావు మాట్లాడుతూ నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారు నిరుపేదలని. దమ్మపేట మండలం ముష్టిబండ రెవెన్యూ డివిజన్ లో సర్వే నెంబర్ 394 .1960 నుండి ఆకులు సత్యం ఆ భూమి లో ఉంటూ ఆ భూమిని 1986లో మేనల్లుడైన దాడి సత్యనారాయణకు ఇవ్వడం జరిగింది అట్టి భూమిపై కొంతమంది దౌర్జన్య కారులు ఆ భూమిని ఆక్రమించుకోవాలని దాడి సత్యనారాయణని భూమి లోకి వెళ్ళకుండా అడ్డు తగులుతూ ఉంటే దాడి సత్యనారాయణ సి పి ఐ పార్టీ సానుభూతిపరుడు భూమిని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లిఖితపూర్వకంగా ఇచ్చి ఉన్నారు అట్టి భూమిలో నిరుపేదల 120. కుటుంబాలు నివాసాలు అంటుంటే రెవెన్యూ అధికారులు ఇప్పుడు మా అవసరాలకు అది కావాలి ఇల్లు ఖాళీ చేయాలని నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు వేరే వాళ్ల చేతుల్లో ఉండగా గుర్తురాని అధికారులకు నిరుపేదలు ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వ స్థలం అని గుర్తు వచ్చిందని సిపిఐ నాయకులు యర్లగడ్డ భాస్కర్ అధికారులు ప్రశ్నించారు నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు తొలగిస్తే ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకు తెలిపినారు తక్షణం 120 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని లేనియెడల పోరాటానికి సిపిఐ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలిపినారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పండూరి వీరబాబు సహాయ కార్యదర్శి సుంకు పాక ధర్మ బెజవాడ రాము ఏ ఐ ఎస్ ఎఫ్ కార్యదర్శి బత్తుల సాయి మహిళా సంఘ కార్యదర్శి జానీ బేగం శాంతి నిరుపేదలకు అండగా స్థానిక సిపిఐ మండల నాయకత్వం పాల్గొంది.

Share it:

TS

Post A Comment: