CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సెయింట్ ఆంటోనీ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి...

Share it:

 


  • మండల విద్యాశాఖ అధికారి గుగులోత్ వెంకట్ ను విధుల నుండి తొలగించాలి.. 
  • పాఠశాల ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా..

జూలూరుపాడు జూన్ 25, మన్యం మనుగడ ప్రతినిధి, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జూలూరుపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సెయింట్ ఆంటోనీ పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్, కొత్తగూడెం డివిజన్ అధ్యక్షులు బోడ అభిమిత్ర మాట్లాడుతూ.. సెయింట్ ఆంటోనీ పాఠశాలలో ఐఐటీ, నీట్ తరగతుల పేరుతో వేల రూపాయల ఫీజులు వసూళ్లు చేస్తున్నారనీ, బుక్స్, యూనిఫాం, షూస్, టై అధిక ధరలకు అమ్ముతున్నారనీ, నిబంధనలకు విరుద్ధంగా ఫిట్ నెస్ లేని బస్ నడుపుతున్నారనీ, అన్నారు. పాఠశాలలో అర్హులైన టీచర్లు లేరనీ, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారితో పాఠాలు చెప్పిస్తున్నారనీ,10వ తరగతి విద్యార్థుల దగ్గర 40 వేల రూపాయలు ఫీజులు వసూళ్లు చేస్తున్నారని తెలిపారు. ఒక్కో తరగతి విద్యార్థుల దగ్గర బుక్స్, యూనిఫారం, షూస్, టై పేరుతో 10 వేల రూపాయలు అదనంగా వసూళ్లు చేస్తున్నారని అన్నారు. మైనారిటీ పేరుతో పాఠశాలలు ప్రారంభించి ఉచితంగా విద్యను అందిస్తామని ప్రగల్భాలు పలికి ఒక్క విద్యాసంవత్సరానికి, ఒక్కొక్క విద్యార్థి దగ్గర 60 వేలు వసూళ్ళు చేస్తున్నారన్నారు.

ఈ పాఠశాలపై అనేకసార్లు, అనేక సమస్యలపై స్థానిక మండల విద్యాశాఖ అధికారి కి మెమోరాండం అందించినా పాఠశాల పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని, అన్నారు. అర్హతగల టీచర్లు లేరనీ, పదవ తరగతి ఫీజులు వెయ్యికి పైగా వసూళ్లు చేస్తున్నారని గతంలో మెమోరాండం అందించినప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు బాహ్యాటంగా పుస్తకాలు, యూనిఫాం అమ్ముతున్నప్పటికీ మండల విద్యాశాఖ అధికారి ఛోద్యం చూస్తున్నారన్నారు‌. పాఠశాలతో పర్సెంటేజీల కోసం కుమ్మక్కయ్యారన్నారు. ప్రశ్నించే విద్యార్థి నాయకులపై కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇంతటి అవినీతికి పాల్పడుతున్న విద్య సంస్థ యాజమాన్యానికి కొమ్ముకాస్తున్న మండల విద్యాశాఖ అధికారి జి వెంకట్ ను వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షురాలు పద్దం మంజుల, మండల కార్యదర్శి జమ్మి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: