CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అగ్నిపత్ తెచ్చింది దేశ రక్షణ వ్యవస్థను ప్రైవేటీకరణ కొరకు. సిపిఎం పార్టీ డిమాండ్,

Share it:

 


 

మన్యం మనుగడ వాజేడు జూన్ 21:    



జై జవాన్ జై కిసాన్ అని వల్లమాలిన దేశభక్తిని ప్రదర్శించే బిజెపి కేంద్ర ప్రభుత్వం నేడు దేశాన్ని పరాయికరణ చేస్తుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు సూడి కృష్ణ రెడ్డిలు అన్నారు,మంగళవారం వాజేడు మండల కేంద్రంలో జరిగిన సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో వారు హాజరై మాట్లాడుతూ దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు నాడు అన్నదాతలు నేడు జవాన్ లను పరాయీకరణ చేసి ప్రయివేటు పరం చేసే పనిలో భాగంగా బిజెపి ప్రభుత్వం నూతన చట్టాలు తీసుకొచ్చి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాయని దుయ్యబట్టారు, నేడు టూర్ ఆఫ్ డ్యూటీ పేరుతో అగ్నిపథ్ తీసుకొచ్చే దేశం కోసం తమ ప్రాణాలను సైతం అంకితం చేసి దేశ రక్షణ తమ ధ్యేయంగా దేశభక్తితో దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో లక్షలాది మంది యువకులు ఎదురు చూస్తున్న తరుణంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం అక్రమంగా అగ్నిపథ్ తెచ్చి వారి ఆశయాలను తుంగలో తొక్కింది అన్నారు, దేశ భద్రత కోసం పని చేసే జవాన్లకు వారి కుటుంబాలకు ఖర్చు చేసే డబ్బును మిగిల్చేందుకు అగ్నిపత్ పేరుతో తీసుకు వచ్చి కాబోయే జవాన్ల ఆశయాల కు బిజెపి ఆర్ ఎస్ ఎస్ కుట్రదారులు అడ్డుకట్ట వేశారని అన్నారు, నాలుగేళ్ల పరిమితితో జవాన్లను తీసుకోవడం అత్యంత దారుణమని దీని ద్వారా రాబోయే కాలంలో దేశానికి ప్రమాదం పొంచి ఉందని అగ్నిపత్ లో ఎంపిక అయిన జవాన్లను నాలుగేళ్ల పాటు జవాన్లు గా పని చేయించుకొని 25 శాతం మంది జవాన్లు మాత్రమే జవాన్లుగా పై కేడర్ లోకి ఎంపిక చేసి మిగతా జవాన్లను బయటకు పంపడం వల్ల దేశ రక్షణ కోసం అత్యున్నతమైన కఠిన శిక్షణను పొంది దేశ రహస్యాలు తెలియడం వలన సంఘవిద్రోహ శక్తులతో కలిసి దేశ భద్రతకు ప్రమాదం తలపెట్టే ప్రమాదం పొంచి ఉందని అన్నారు,ఈ పథకం వలన దేశానికి దేశ సేవకు పనిచేయాలనే యువతకు నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు, కేంద్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చి అగ్నిపత్ ను తక్షణమే రద్దు చేయాలని లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు,ఈ ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు లక్ష్మయ్య కొప్పుల రఘుపతి మండల నాయకులు దామోదర్ బచ్చల కృష్ణబాబు బుగ్గల దేవయ్య విజయ్ బాబు రమాదేవి పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: