భద్రాద్రిజిల్లా :
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సోషల్ మీడియా పోస్టులు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. పొదెం వీరయ్యకు నియోజకవర్గం లేకుండా చేస్తానని రేగా కాంతారావు సంచలన కామెంట్స్ చేశారు.
2023 తర్వాత వీరయ్య కొత్త నియోజకవర్గం వెతుక్కోవాలని రేగా టీజ్ చేయగా,
బంపర్ మెజారిటీతో గెలుస్తా.. దమ్ముంటే ఓడించు అంటూ పొదెం వీరయ్య సవాల్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ రేగాల మధ్య మాటల మంటలు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో హాట్ హాట్ గా నేతల కామెంట్లు వైరల్ గా మారాయి.
.......
Post A Comment: