
గుండాల జూన్ 20(మన్యం మనుగడ) తొలకరి వర్షానికి మండలంలోని వాగులు వంకలు ఉప్పొంగాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని వాగు లన్ని ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి మండలం పరిధిలోని చెట్టు పల్లి గ్రామ సమీపంలో గల వాగు ఉప్పొంగి రహదారిపై నుండి ప్రవహించడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది తొలకరి వర్షం పలకరించడంతో రైతులలో సంతోషం వ్యక్తమవుతుంది
Post A Comment: