CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సాగులో ఉన్న పోడు భూములు జోలికి వస్తే ఊరుకోం... సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ డిమాండ్...

Share it:

 


                       

మన్యం టీవీ దుమ్ముగూడెం ::

దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల హక్కుల కొరకు సమగ్ర చట్టం కావాలని వ్యవసాయ కార్మికులు అందరికీ ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో ఇవ్వడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని గిరిజన రైతాంగం సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోతే తీవ్రమైన పోరాటం తప్పదని 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి గిరిజన రైతాంగానికి న్యాయం చేయకపోతే ప్రభుత్వంపై దశలవారీ పోరాటానికి నాంది పలుకుతామని హెచ్చరించారు ఈ సమావేశంలో వ్యవసాయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎన్నుకోన్నారు అధ్యక్షులు వర్షా గౌరయ్య, కార్యదర్శి వర్ష వెంకటేష్, ఉపాధ్యక్షుడు కొమరం బాలక్రిష్ణ, ఉపాధ్యక్షుడు సోడి ఎర్రయ్య, జాయింట్ సెక్రెటరీ అప్పాక నాగరాజ్ ఎనుకున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తమ్మల వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పేరాల శ్రీనివాస్ రావు, సిపిఐ మండల కార్యదర్శి రావులపల్లి రవికుమార్, మండల సహాయ కార్యదర్శి నోముల రామిరెడ్డి, తాడిపూడి రమేష్, తదితరులు పాల్గొన్నారు 

Share it:

TS

Post A Comment: