CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండలంలో విస్తృత పర్యటించిన ఎంపీపీ జల్లిపల్లి.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని పలు గ్రామాలలో అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పల్లె ప్రగతి కార్యక్రమం లో 6 వ రోజు భాగంగ మండలంలోనీ తిరుమల కుంట, రెడ్డి గూడెం, కొత్త మావిళ్ళ వారి గూడెం, పలు గ్రామాలలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించి మొక్కలు వేసే ప్రదేశాలను పరిశీలించామని, అలాగే ప్రతి ఒక్క గ్రామ పంచాయతి పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనీ అలాగే ప్రతీ పల్లే పచ్చని మణిహారంల అవ్వాలని తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో మనం పెంచిన మొక్కలు వలన అటవీ శాతం పెరిగిందని అలాగె వేసినా ప్రతి మొక్కను ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా వాటికి నీరు పోసి పెరిగేందుకు సహకరించాలని ఎంపీపీ కోరారు. అదే విదంగా ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయిలో ప్రవేట్ విద్యాసంస్థలకు ధీటుగా ఆంగ్ల విద్యా బోధనా ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి పాఠశాల నూతన హంగులను దిద్దుకుంటు ప్రతి ఒక్క విద్యార్ధి కి ఆంగ్ల విద్యను అందించే దిశగా మన ఊరు మన బడి కార్యక్రమన్ని ప్రవేశ పెట్టారని దీని కోసం కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారని, ఈ సందర్భంగ అశ్వరావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగె రెడ్డి గూడెం గ్రామం లో బడి బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు సర్పంచ్ లు యాట్లా మహేశ్వర రెడ్డి, సున్నం సరస్వతి, ఉప సర్పంచ్ జుజ్జూరపు రాంబాబు, ఎంపీడీఓ విద్యాధర రావు, ఎంపీఓ సీత రామరాజు, సెక్రటరీ రమేష్, అనూష, స్పెషల్ ఆఫీసర్ రాణి, రాజేశ్వర రావు, తెరాస పార్టి ప్రెసిడెంట్ చెన్నరావు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: