CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు సమస్యల పరిష్కారం కోసమే రైతు రచ్చబండ..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం ::


రైతు సమస్యలు పరిష్కరించేందుకే రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,భద్రాచలం ఎంమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు దుమ్ముగూడెం మండలం గౌరారం, మడకం వారి గుంపు, కే లక్ష్మీపురం గ్రామాలలో "రైతు రచ్చబండ" కార్యక్రమంలో భాగంగా రైతు డిక్లరేషన్ ను రైతులకు వివరించారు. ఈసందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ అమలు కాక, విత్తన రాయితీ, వ్యవసాయ పనిముట్ల రాయితీ, పంట నష్టపరిహారం, పంట బీమా, రైతు రుణాలపై వడ్డీ రాయితీ, తూకంలో కొరత వంటి సమస్యలతో తెరాస పాలనలో రైతులకు తీవ్రఅన్యాయం జరుగుతుందన్నారు. కనీస మద్దతు ధర కల్పనకు చట్టబద్ధతతో పాటు రైతు, రైతు కూలీలకు, అసంఘటిత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అభయహస్తం పథకం ద్వారా రూ.5వేల పెన్షన్ ను అందించి రైతులకు అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతోనే రైతాంగానికి మేలు జరుగుతుందని 2004 -2014నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చేసిన కార్యక్రమాలన్నీ మళ్లీ అమలు చేస్తామని ప్రజల్లోకి వెళ్తున్నామని, రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాట ధర కల్పించడమే కాకుండా కల్లాల్లోనే సేకరణ చేసి రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు, గిరిజనులకు వారు సాగు చేసుకుంటున్న అన్ని పోడు భూములకు పట్టాలు ఇస్తామన్నారు. రైతు, రైతు కూలీలకు సమానంగా న్యాయం జరిగేలా రైతుభీమా అమలుతో పాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి కూలీలకు భద్రత కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు, బైరెడ్డి సీతారామారావు , తెల్లం నరేష్ , సమ్మయ్య,కనుబుద్ది దేవా, గ్రామస్తులు పాలొన్నారు.

Share it:

TS

Post A Comment: