CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పల్లె ప్రకృతి వనాలను సందర్శించిన కలెక్టర్, కృష్ణ ఆదిత్య.

Share it:


మన్యం మనుగడ వాజేడు జూన్ 10:

పల్లె ప్రగతి ఐదో విడత కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, మండల కేంద్రాలలో, గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి సాధించాలని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది, పలు పంచాయతీలలో అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాజేడు మండలం పలు గ్రామ పంచాయతీలను ములుగు జిల్లా కలెక్టర్, కృష్ణ ఆదిత్య. సందర్శించారు. చీకుపల్లి గ్రామంలో ఆదివాసీల ఇలవేల్పు ముయ్యాలమ్మ దేవర పండుగ మూడు రోజులుగా జరుగుతుంది. చివరి రోజు శుక్రవారం నాడు కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆ తల్లి సన్నిధిలో కి వెళ్లి దర్శనం చేసుకున్నారు. అనంతరం పర్యటనలో భాగంగా మురుమూరు గ్రామపంచాయతీ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి ఐదో విడత పల్లె ప్రగతి లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పంచాయతీ కార్యదర్శి చిడెం నరేష్ బాబు ను అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామపంచాయతీ సర్పంచ్ పూసం నరేష్ కుమార్ కలెక్టర్ దృష్టికి కొన్ని అభివృద్ధి పనులను తీసుకెళ్లగా కలెక్టర్. సానుకూలంగా స్పందించి మొదటి విడత లో ఇచ్చినటువంటి స్కూల్స్ అంగన్వాడీలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించి కొత్త అంగన్వాడి బిల్డింగ్ మరియు సిసి రోడ్ల కు మరిన్ని నిధులు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో లక్ష్మణ్, ఎంపీడీవో విజయ,ఎంపీపీ శ్యామల శారద,ఎం పీ ఓ శ్రీకాంత్, ఏ పీ ఓ అంకుష్, ఎస్ఐ హరీష్, స్థానిక సర్పంచ్ పూసం నరేష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ఛీడం నరేష్ బాబు, ఉప సర్పంచ్ గౌరరాపు కోటేశ్వరరావు, వార్డు నెంబర్ బోదె బోయిన మోహన్ రావు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: