CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వ్యాయామం ద్వారా సాధారణ ప్రసవం. వైద్య నిపుణుల సూచన.

Share it:

 


మన్యం మనుగడ వాజేడు జూన్ 24:



వైద్య విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ వైద్య నిపుణులు,డాక్టర్లు వ్యాయామం ద్వారా సాధారణ ప్రసవం జరుగుతుందని

ఈరోజు వాజేడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పేరూరు ఆరోగ్య కేంద్రం,ఆశా కార్యకర్తలకు, వాజేడు మండల కేంద్రంలో సాధారణ ప్రసవం గురించి. గర్భవతులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల ద్వారా వ్యాయామం ఏవిధంగా చేయాలి, ఏ రకమైన వ్యాయామాలు చేయాలి, వ్యాయామ, యోగ ఆసనాల ద్వారా ఒక బిడ్డ కి జన్మనివ్వడం చాలా సులభతరంగా ఉంటుంది. అని గర్భిణీ స్త్రీలకు యోగాసనాలు వ్యాయామాలు నేర్పించారు. ప్రతి గ్రామంలో ఆశాలు వర్కర్లు, గర్భం దాల్చిన తల్లిని, గుర్తించి రిజిస్ట్రేషన్ చేయించి, మొదటగా ఐరన్ పోలిక్, గోలీలు గర్భవతులకి ఇచ్చి , ప్రసవం అవ్వాలి అంటే యోగ ఆసనాలు సాధారణమైన వ్యాయామాలు చేస్తూ వాళ్ళు గర్భవతిగా ఉన్నప్పటి నుండి చేయించినట్లయితే వారికి సాధారణ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందని, వైద్య నిపుణుల సూచన మేరకు, కార్యకర్తలకి ఏఎన్ఎంలకి పరిమితమై ఆసనాల గురించి నేర్పించడం జరిగింది. క్రమంగా గర్భవతులకు అవగాహన కల్పించి వ్యాయామాలు చేయించాలని అప్పుడే సుఖమైన ప్రసవాలు ఉంటాయని డాక్టర్ ఎం ఓ, నంబి కిషోర్ అన్నారు. ఈ విధంగా చేయుట మూలాన ప్రతి ఒక్క గర్భవతి కూడా సాధారణ కాన్పుగా ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొదటి కాన్పు సాధారణ కాన్పు కావాలి అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు గర్భవతులకి యోగ చేయించడం జరుగుతుందనీ అన్నారు. 

 పేరూరు పి హెచ్ సి ఆశవర్కర్లు యోగాసనాల,ట్రైనింగ్ తీసుకోవటం జరుగుతుంది. ఆసనాల లాభాలను గురించి ఆపరేషన్ ద్వారా జరిగే నష్టాల గురించి ఎక్కువగా గర్భవతులకు అవగాహన కల్పించి సాధారణ కాన్పుగా ప్రయత్నం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని, బిడ్డకు భద్రతగా,తల్లి వెంటనే ముర్రుపాలు ఇచ్చే ప్రాముఖ్యత తల్లికి కలుగుతుందనీ విషయాలను గుర్తించి, ప్రతి ఒక్క గర్భవతికి విషయాలను చేరవేయాలని తెలిపారు.


 ఈ కార్యక్రమంలో. ఏఎన్ఎం ఆశ కార్యకర్తలు, గర్భవతులు, ఇతరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: