CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా..సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం..

Share it:


మన్యం మనుగడ : జూలూరుపాడు, ఆర్టీసీ ఛార్జీల పెంపుతో సామాన్య ప్రజలపై మోయలేని భారం పడిందని సిపిఐ జిల్లా సమితి సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ధర్నాను ఉద్దేశించి చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్టీసీ ఎక్కలేని పరిస్థితి నెలకొందని అన్నారు. ఒకపక్క నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ఈ పరిస్థితుల్లో చార్జీలను పెంచి సామాన్యులను నడ్డివిరిచేప్రయత్నం కొనసాగుతుందని అన్నారు. రాబోయే కాలంలో ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తక్షణమే పెంచిన ఛార్జీలను తగ్గించకుంటే ప్రజల పక్షాన సిపిఐ పార్టీ పెద్దఎత్తున ఉద్యమాల నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎల్లంకి మధు, చింత స్వరాజ్ రావు, గార్లపాటి వీరభద్రం, వలమల సామేలు, నిమ్మ టూరి లచ్చయ్య, బడుగు వీరస్వామి, పత్తిపాటి పగడాల, అఖిల్, బరగడ రమేష్, సమీర్, అన్వర్, ఎస్కే బుడేను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: